TSPSC Big Update: Alert to candidates.. TSPSC has taken a key decision on horizontal reservations..
TSPSC Big Update: అభ్యర్థులకు అలర్ట్.. హారిజాంటల్ రిజర్వేషన్స్ పై కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్పీఎస్సీ..
టీఎస్పీఎస్సీ హారిజాంటల్ రిజర్వేషన్స్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రతీ నోటిఫికేషన్ కు మహిళలకు హారిజాంటల్ విధానంలో పోస్టులను కేటాయించనున్నట్లు వెబ్ నోట్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. ప్రతీ నోటిఫికేషన్ కు ఈ విధానాన్ని అమలు చేస్తామని వెబ్ నోట్ విడుదల చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తున్నట్లు తెలియజేసింది. రాజేష్ కుమార్ దరియా Vs రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని తీర్పు ఇవ్వడంతో.. అదే విధానాన్ని టీఎస్పీఎస్సీ కూడా పాటిస్తుందని పేర్కొంది. అన్ని కేటగిరీలలో మహిళా అభ్యర్థులకు క్షితిజసమాంతర రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు తెలిపింది. ఇక తుది ఫలితాలు హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఉంటాయని టీఎస్పీఎస్సీ పేర్కొంది.
అయితే ఇప్పటి వరకు ఫైనల్ ఫలితాలు విడుదల అవ్వని నోటిఫికేషన్లకు సంబంధించి ఫైనల్ ఫలితాలు ఈ రిజర్వేషన్ ఆధారంగా విడుదల కానున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు కూడా మహిళలకు హారిజాంటల్ విధానాన్ని అనుసరిస్తూ విడుదల కానున్నాయి. జులై మూడో వారంలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల కానున్నాయి.
భారత రాజ్యాంగం, సుప్రీం కోర్టు తీర్పుల ఆధారంగా దేశంలో ప్రభుత్వ విద్య , ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు. 1. Vertical/Social.. 2. Horizontal/Special రిజర్వేషన్లు. వర్టికల్ రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు వస్తారు. హారిజాంటల్ రిజర్వేషన్లలో మహిళా, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్ల అభ్యర్థులు వస్తారు.
ఇటీవల సుప్రీం కోర్టు వికలాంగుల రిజర్వేషన్లను కూడా వర్టికల్‌గా లెక్కించాలని ఆదేశించింది. కానీ ప్రత్యేక కోటా కింద కల్పించిన మహిళా రిజర్వేషన్లను కూడా తెలంగాణ సర్కారు వర్టికల్‌గా అమలు చేస్తూ నిబంధనలను ఉల్లంఘించగా.. తాజాగా మహిళలకు హారిజాంట్ రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు తెలిపింది.
Important Link:
FOR Short Note CLICKHERE
COMMENTS