HDFC Merger: Alert to customers.. HDFC will no longer be seen, the merger will take effect from July 1!
HDFC Merger: కస్టమర్లకు అలర్ట్.. ఇక హెచ్‌డీఎఫ్‌సీ కనిపించదు, జూలై 1 నుంచి విలీనం అమలులోకి!
HDFC Bank News | దిగ్గజ ఆర్థిక సంస్థలుగా కొనసాగుతూ వస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీన ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం కానుంది. జూలై 1 నుంచి ఈ విలీనం అమలులోకి రానుంది. జూన్ 30న హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (Bank) బోర్డులు సమావేశం కానున్నాయని, తర్వాత విలీనం అమలులోకి వస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపర్ పరేఖ్ తెలిపారు. అలాగే విలీనం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు కూడా స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్టింగ్ కానున్నాయి. జూలై 13 తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు ఇక కనిపించవు. హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లుగా ట్రేడ్ అవుతాయి.
జూన్ 30 చివరి హెచ్‌డీఎఫ్‌సీ బోర్డు మీటింగ్ అని పరేఖ్ తెలిపారు. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఏప్రల్ నెలలలోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు విలీన ప్రక్రియకు ఆమోదం తెలిపింది. ఈ విలీనం తర్వాత దేశంలో 168 బిలియన్ డాలర్ల విలువతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్తగా అవతరించనుంది. అందువల్ల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 25 హెచ్‌డీఎఫ్‌సీ షేర్లకు 42 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లను కేటాయించనుంది. రికార్డ్ డేట్‌కు కూడా ఎక్కువ కాలం తీసుకోమని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు కలిగిన వారు ఈ విషయాన్న గుర్తించుకోవాలి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనేది దేశంలోని ప్రధానమైన బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తోంది. కాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాకం 2022 ఏప్రిల్ నెలలో హెచ్‌డీఎఫ్‌సీని కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ డీల్ విలువ దాదాపు 40 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. కాగా ఈ విలీన వార్తల నేపథ్యంలో మధ్యాహ్నం 2.50 గంటలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు 1.43 శాతం పెరిగింది. రూ. 1658 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ షేరు 1.65 శాతం పెరిగింది. రూ. 2764 వద్ద కదలాడుతోంది.
జూలై 1 నుంచి హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన అన్ని సెంటర్లు ఇకపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌గా మారనున్నాయి. అలాగే ఇవి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు సర్వీస్ సెంటర్లుగా పని చేయనున్నాయి. ఇండియన్ కార్పొరేట్ చరిత్రలో ఈ డీల్ అతిపెద్దదని చెప్పుకోవచ్చు. విలీనం తర్వాత ఏర్పడే సంస్థ విలవ ఏకంగా రూ. 18 లక్షల కోట్లుగా ఉండనుందని తెలుస్తోంది. కాగా దేశంలో అతిపెద్ద మోర్ట్‌గేజ్ సంస్థగా హెచ్‌డీఎఫ్‌సీ కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. విలీనం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు, కొత్త కస్టమర్లకు తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్స్ లభించే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. అంటే రుణాలు, క్రెడిట్ కార్డులు, ఎఫ్‌డీ స్కీమ్స్ ఇలా అన్ని సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తెలియజేస్తున్నారు.
COMMENTS