GGH: Theater Assistant, Nursing Orderly Posts in Kakinada GGH - Eligible!
GGH: కాకినాడ జీజీహెచ్‌లో థియేటర్ అసిస్టెంట్, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు - అర్హతలివే!
కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాంట్రాక్ట్/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన థియేటర్ అసిస్టెంట్, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి 10వ తరగతి, డిప్లొమా, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జులై 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపిక విధానం ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 07
1) థియేటర్ అసిస్టెంట్: 01
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. డిప్లొమా(మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ & ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్) కోర్సు చేసి ఉండాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో సభ్యత్వం ఉండాలి.
2) మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 04
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి.
3) ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 02
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. గరిష్టంగా 52 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో ఇందులో 75 మార్కులు క్వాలిఫైయింగ్ పరీక్షలో వచ్చిన మార్కులకు, 15 మార్కులు అనుభవానికి, 10 మార్కులు నిబంధనల మేరకు ఇతర అర్హతలకు కేటాయిస్తారు.
జీతం: నెలకు రూ.15,000.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Superintendent Office,
Government General Hospital,
Kakinada, Kakinada District
ముఖ్యమైనతేదీలు..
ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.07.2023.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.07.2023
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
COMMENTS