For those who are eligible for discount on ticket prices of AC coaches in trains - Conditions apply.
రైళ్లల్లో ఏసీ కోచ్ ల టికెట్ ధరల్లో రాయితీ వర్తించేదెవరికి - కండీషన్స్ అప్లై.
రైళ్లల్లో ఏసీలో ప్రయాణంచే వారికి గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే శాఖ. ఈ రాయితీ అందరికీ వర్తించదు. ఇందుకు అనేక కండీషన్లు ఉన్నాయి. భారత్, అనుభూతి, విస్టాడోమ్ ఎక్స్‌ప్రెస్ సహా అన్ని రైళ్లలోని ఏసీ చెయిర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ల టికెట్ చార్జీల్లో 25శాతం వరకూ డిస్కౌంట్ ఇస్తున్నట్లు రైల్వే బోర్డు శనివారం ప్రకటించింది.
ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి ఈ తగ్గింపు వర్తించదు.
రైల్వే శాఖ కీలక నిర్ణయం: రైళ్లల్లో ఏసీ కోచ్ ల్లో ప్రయాణించే వారి కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వందేభారత్ సహా ఏసీ కోచ్ లలో ప్రయాణించే వారి టికెట్ ధరలు 25 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించింది. అయితే, అక్కడ కొన్ని షరతులను ఖరారు చేసింది. తగ్గింపు తక్షణం అమలు అంటూనే మెలిక పెట్టింది. రైళ్లలోని ఆక్సుపెన్సీ ఆధారంగా ఈ తగ్గింపు ఉండనుంది. గత 30 రోజుల్లో ఆక్యుపెన్సీ 50ు కంటే తక్కువ ఉన్న రైళ్లనే ఈ డిస్కౌంట్‌కు పరిగణనలోకి తీసుకుంటారు.
రైలు ప్రయాణించే మొత్తం దూరం లేదా వివిధ స్టేషన్ల మధ్య ఈ డిస్కౌంట్‌ను ఇచ్చే అవకాశం ఉంది. నిజానికి కొన్ని రైళ్లలో ఆక్యుపెన్సీ ఎక్కువగా, మరికొన్ని రైళ్లలో చాలా తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆయా రైళ్లలోని సీట్లను పూర్తి స్థాయిలో భర్తీ చేయడమే లక్ష్యంగా తాజా డిస్కౌంట్‌ను తెరపైకి తీసుకొచ్చింది.
షరుతులు వర్తిస్తాయి: రైల్వే శాఖ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ లో ఆక్యుపెన్సీ పెంచుకోవటమే ఈ నిర్ణయం వెనుక అసలు లక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లోని వందే భారత్ రైళ్లు పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. దీంతో ఇక్కడ కొనసాగుతున్న వందేభారత్ రైళ్లకు రాయితీ వర్తించదు. భోపాల్-ఇండోర్ వందే భారత్ రైల్లో ఆక్యుపెన్సీ కేవలం 29శాతమే. ఇక, ఇండోర్ నుంచి భోపాల్ వచ్చే వందే భారత్ ఆక్యుపెన్సీ 21 శాతమే.
అలాగే నాగ్‌పూర్-బిలా్‌సపూర్ వందే భారత్ ఆక్యుపెన్సీ 55 శాతం కాగా భోపాల్-జబల్‌పూర్ వందే భారత్ ఆక్యుపెన్సీ 32 శాతమే. ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని ఏసీ చార్జీలతో పోలిస్తే వందే భారత్ రైళ్లలో చార్జీలు చాలా ఎక్కువ. ఫలితంగా వాటిలో ఆక్యుపెన్సీ తక్కువగా ఉందని రైల్వే శాఖ గుర్తించింది. ఇప్పుడు రాయితీ ద్వారా అక్యుపెన్సీ పెంచుకోవాలనేది తక్షణ టార్గెట్.
నిర్ణయం వారి చేతుల్లోనే: రాయితీలపైన నిర్ణయాధికారం రైల్వే జోన్లలోని ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు అప్పగించింది. అయితే, బేసిక్ చార్జీ మీదే ఈ 25 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. రిజర్వేషన్ చార్జీ, సూపర్ ఫాస్ట్ సర్ చార్జీ, జీఎస్టీ తదితరాలపై వర్తించదు. డిస్కౌంట్ ఎంత శాతం ఇవ్వాలనే అంశాన్ని ప్రత్యామ్నాయ రవాణా చార్జీల ఆధారంగా నిర్ణయిస్తారు. ఆయా రూట్లలోని బస్సు, విమాన చార్జీల ఆధారంగా ఉంటుంది.
ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి, హాలీడే, పండుగ స్పెషల్స్ రైళ్లకు ఈ డిస్కౌంట్ వర్తించదు. ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్ పథకాన్ని కూడా ఉపసంహరిస్తారు. ప్రయాణ తేదీలను బట్టి గరిష్ఠంగా ఆరు నెలల వరకూ ఇది అమల్లో ఉంటుంది. ఇలా అనేక మెలికలు పెట్టిన ఈ రాయితీ అమలుతో ఎవరికి మేలు చేస్తుందనేది అంతు చిక్కటం లేదు.
COMMENTS