Farmers Schemes: These are the 5 schemes offered by the Center to the farmers... and are they getting their benefits?
Farmers Schemes: రైతులకు కేంద్రం అందిస్తోన్న 5 పథకాలు ఇవే.. మరి వాటి బెనిఫిట్స్ అందుతున్నాయా?
Farmers Schemes: దేశంలోని రైతులకు వివిధ రకాల ప్రయోజనాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా రకాల పథకాలను అందిస్తోంది. ఈ అన్ని పథకాల గురించి అందరికి తెలియకపోవచ్చు. ఆయా పథకాల గురించి తెలుసుకుని ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.
Farmers Schemes: దేశంలోని రైతులని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇందులో చాలా వరకు రైతులకు తెలియకపోవచ్చు. ఈ స్కీమ్స్‌లో చేరడం ద్వారా రైతులకు పలు ప్రయోజనాలు అందుకోవచ్చు. ఇందులో నీటి పారుదల స్కీమ్ నుంచి ఇన్సూరెన్స్ వరకు ఉన్నాయి. ఆయా పథకాల బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన: పంట నష్టపోయిన రైతులకు ఆర్థికంగా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ప్రారంభించింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు ఒకే చోటికి చేర్చే ప్రయత్నం చేసింది. ఈ స్కీమ్ కోసం విపత్తు, తెగుళ్లు, కరువు కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడు బీమా పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తారు.
కిసాన్ క్రెడిట్ కార్డు: కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని కేంద్రం 1988లో ప్రారంభించింది. దీని ద్వారా వ్యవసాయానికి తగిన రుణాన్ని అందిస్తారు. ప్రభుత్వ సబ్సిడీల రూపంలో ఏడాదికి 4 శాతం రాయితీ రేటుతో వ్యవసాయ రుణాలు అందిస్తారు. ఇప్పటి వరకు 2.5 కోట్ల మంది రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
కిసాన్ సమ్మాన్ నిధి పథకం: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది రైతులకు ఏటా 6 వేల రూపాయలు అందిస్తోంది. దేశంలోని ఏ రైతు అయినా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం మూడు వాయిదాలలో డబ్బులు అందుతాయి. అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరంపరగత్ కృషి వికాస్ యోజన: ఈ పథకం కింద భారత ప్రభుత్వం రైతులకు హెక్టారుకు రూ.50 వేలు ఆర్థిక సహాయం అందిస్తోంది. సేంద్రీయ ఉత్పత్తిలో ఆర్గానిక్ ప్రాసెసింగ్, సర్టిఫికేషన్, లేబులింగ్, ప్యాకేజింగ్, రవాణా కోసం ప్రతి మూడు ఏళ్లకు ఒకసారి సహాయం అందిస్తారు. సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తుంది.
పీఎం కిసాన్ నీటి పారుదల స్కీమ్: సాగు నీటికి సంబంధించిన ప్రధాన సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజనను ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ప్రతి పొలానికి నీరు అందిచాలి. దీనికింద రైతులకు సోర్స్ క్రియేషన్ వివరాలు, బోర్డు, ఫీల్డ్ అప్లికేషన్, డెవలప్‌మెంట్ పద్ధతులపై ఎండ్ టు ఎండ్ మేనేజ్‌మెంట్‌ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సహా ఇతర నాలుగు పథకాలకు రైతులు దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందవచ్చు.
COMMENTS