Education Loan: Loan up to Rs. 50 lakh.. Good news for students from the bank at less than Rs.
Education Loan: రూ.50 లక్షల వరకు లోన్.. రూపాయి కన్నా తక్కువ వడ్డీకే, విద్యార్థులకు బ్యాంక్ శుభవార్త!
Student Loan | బ్యాంకులు చాలా రకాల రుణాలు అందిస్తున్నాయి. వీటిల్లో ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఉన్నాయి. బ్యాంకుల ప్రాతిపదికన లోన్ అమౌంట్ మారుతూ ఉంటుంది. ఇంకా వడ్డీ రేట్లలో కూడా మార్పు కనిపిస్తుంది. అందుకే ఎడ్యుకేషన్ లోన్ (Loan) తీసుకోవాలని భావించే వారు ఈ విషయాలను గుర్తించుకోవాలి. తక్కువ వడ్డీ రేటుకే లోన్ ఇచ్చే బ్యాంక్‌ను (Bank) ఎంచుకోవాలి. మనం ఇప్పుడు తక్కువ వడ్డీకే ఎడ్యుకేషన్ లోన్స్ ఆఫర్ చేస్తున్న ఒక బ్యాంక్ గురించి తెలుసుకోబోతున్నాం.
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కూడా చౌక వడ్డీకే ఎడ్యుకేషన్ లోన్స్ అందిస్తోంది. ఏకంగా రూ. 50 లక్షల వరకు లోన్ పొందొచ్చు. తనఖా లేకుండానే ఈ రుణం లభిస్తుంది. అలాగే వడ్డీ రేటు కూడా 9 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. 25 వేలకు పైగా కోర్సులకు మీరు ఎడ్యుకేషన్ లోన్ పొందొచ్చు. అంతర్జాతీయంగా 3,200కు పైగా యూనివర్సిటీలో చదివేందుకు రుణాలు లభిస్తున్నాయి.
హైయర్ ఎడ్యుకేషన్ లోన్ ఇంటర్నేషనల్, హైయర్ ఎడ్యుకేషన్ లోన్ ఇండియా అనే కేటగిరిల కింద మీరు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ స్కూల్ ఫీజు ఫైనాన్స్ సర్వీసులు కూడా తీసుకురాబోతోంది. బ్యాంక్ విద్యార్థుల కోసం ఫస్ట్ యూని పేరుతో ఒక యాప్‌ను అందుబాటులో ఉంచింది. ఈ యాప్ ద్వారా మీరు కాలేజీలు, కోర్సులు , స్కాలర్‌షిప్ వంటి వివరాలు పొందొచ్చు. అలాగే ఈ యాప్ ద్వరా ఇంకా ఇతర సర్వీసులు కూడా లభిస్తున్నాయి.
సెక్షన్ 80ఈ కింద ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. అలాగే ఫ్లెక్సిబుల్ రీపమెంట్ ఆప్షన్లు పొందొచ్చు. కస్టమైజ్డ్ సొల్యూషన్స్ కూడా లభిస్తాయి. 100 శాతం వరకు ఫైనాన్స్ లభిస్తుంది. డోర్ స్టెప్ లోన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సదుపాయం పొందొచ్చు. 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు లోన్ పొందొచ్చు. భారతీయ పౌరులు అయ్యి ఉండాలి. ఇన్‌స్టిట్యూషన్ లేదా కోర్సులో అడ్మిషన్ పొంది ఉండాలి. అడ్మిషన్ లేకపోతే ప్రిఅడ్మిషన్ శాంక్షన్ లెటర్ అయినా ఉండాల్సిందే.
ఎడ్యుకేషన్ లోన్ కింద ట్యూషన్ ఫీజు, ఎగ్జామినేషన్/ లైబ్రెరీ/ ల్యాబొరేటరీ ఫీజులు, బుక్స్/ ఎక్సిప్‌మెంట్/ యూనిఫామ్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజు, ఇతర లివింగ్ ఖర్చులు అన్నీ కూడా ఎడ్యుకేషన్ లోన్ కింద కవర్ అవుతాయి. అలాగే ట్రావెల్ ఖర్చులు, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ కొనుగోలు, ఓవర్సీస్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి కూడా ఎడ్యుకేషన్ లోన్‌లో కవర్ అవుతాయని బ్యాంక్ పేర్కొంటోంది. కాగా ఎడ్యుకేషన్ లోన్‌పై 1.5 శాతం ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది.
COMMENTS