Degree: Changes in degree groups in addition to BTech.. Details of new courses.
Degree: బీటెక్‌కు దీటుగా డిగ్రీ గ్రూప్స్‌లో మార్పులు.. కొత్త కోర్సుల వివరాలు.
ఇంజనీరింగ్‌కి ధీటుగా డిగ్రీ గ్రూప్స్‌లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో సంప్రాదాయ డిగ్రీ కోర్సులకు డిమాండ్ పెరిగింది. విద్యార్థులను డిగ్రీ కోర్సుల వైపు మళ్లించేందుకు దేశవ్యాప్తంగా కసరత్తు జరుగుతోంది.
ఇందులోభాగంగా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మార్కెట్ అవసరాలకు అనువైన కోర్సులను తెస్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా ఇటివలి కాలంలో డిగ్రీకి గట్టి డిమాండ్ నెలకొంది. ఈ క్రమంలోనే కొత్త కోర్సులు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్‌కి అనుగుణంగా కోర్సులు క్రియేట్ చేస్తున్నారు.
తెలంగాణలో కొత్తగా కోర్సులు:
డిగ్రీలో కొత్తగా మరో 15 సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సులను తీసుకొచ్చింది సర్కార్. నిజానికి గతంలో ఏడు కోర్సులు పెట్టాలని అనుకున్నారు. ఈ మేరకు ఓ నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ స్థానిక అవకాశాలు, కాలేజీల విజ్ఞప్తుల మేరకు మొత్తంగా వాటి సంఖ్యను 22కు చేర్చారు. మొదట ఆయా కోర్సులను 36 ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశపెట్టగా, ఇటీవలే మరో 30 ప్రైవేట్ కాలేజీల్లో నిర్వహణకు అనుమతిచ్చారు. మూడేళ్ల కాల వ్యవధి కలిగిన ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులు సంబంధిత పరిశ్రమల్లో అంప్రెటిస్‌షిప్ చేయాల్సి ఉంటుంది. మూడో విడత దోస్త్ కౌన్సెలింగ్‌లో వీటిని ఆప్షన్లుగా ఎంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో మూడో విడుత రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కొత్త కోర్సులు
A) బీబీఏ
1)బీబీఏ రిటైల్ ఆపరేషన్స్
2)బీబీఏ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్
3) బీబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్
4) బీబీఏ హాస్పిటాలిటీ అండ్ రెస్టారెంట్ మేనేజ్‌మెంట్
5) బీబీఏ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ ఫుడ్ బేవరేజ్ సర్వీస్ ఆపరేషన్స్
6) బీబీఏ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ ఫెసిలిటీ ఆపరేషన్స్
7) బీబీఏ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ అకామడేషన్ ఆపరేషన్స్
B) బీఏ
1) బీఏ ఫెర్మార్మింగ్ ఆర్ట్స్
2) బీఏ ఫ్యాషన్ డిజైన్
C) బీఎస్సీ
1) బీఎస్సీ ఫార్మా సేల్స్
2) బీఎస్సీ ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్నాలజీ
3) బీఎస్సీ క్వాలిటీ కంట్రోల్
4) బీఎస్సీ గ్రాఫిక్ డిజైన్ అండ్ డిజిటల్ అడ్వర్టయిజింగ్
5) బీఎస్సీ యానిమేషన్ బీఎస్సీ గేమింగ్
COMMENTS