Tip to Save Electricity: Is the current bill ringing? If you make these small changes at home, it will be reduced by half!
Tip to Save Electricity: కరెంట్ బిల్లు మోత మోగుతుందా? ఇంట్లో ఈ చిన్న మార్పులు చేస్తే సగానికి తగ్గుతుందిగా!
Power Bill Tricks: ఇప్పటికే నిత్యావసర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు టమాటా కిలో రూ.200పైనే. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా ప్రియంగానే ఉంది. ఇక పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ మరో ఎత్తు. అయితే ఈ నేపథ్యంలోనే వీటి ఖర్చుల్ని మనం సాధ్యమైనంత తగ్గించుకోవాలి. ఇప్పుడు కరెంట్ బిల్లు తగ్గించుకోవడం ఎలానో చూద్దాం.
Current Bill Calculator: నిత్యావసర వస్తువుల ధరలే కాకుండా పెట్రోల్, గ్యాస్, నూనెలు, పప్పులు ఇలా అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు కూరగాయల్లో టమాటా రేటు కేజీకి రూ. 200పైకి చేరింది. దీంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వీటి వినియోగాన్ని తగ్గించుకోవడం లేదా పొదుపు చేయడంపై దృష్టి పెట్టి డబ్బులు ఆదా చేయాలని భావిస్తున్నారు. అయితే దీనిని ఎలా చేయాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఎక్కువ చెల్లిస్తుంటారు. ఇక నెలానెలా చెల్లించేవాటిల్లో కరెంట్ బిల్లు కూడా సామాన్యులకు ఇబ్బందే. ఇక ఇది కూడా ఈ మధ్య వందల్లో వస్తుంటుంది.
దీనిని మాత్రం మనం కొన్ని చిట్కాలు పాటిస్తూ తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం 3 చిట్కాలు పాటించడం ద్వారా లేదా కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ కరెంట్ బిల్లును భారీగా తగ్గించుకునే అవకాశం ఉంది. ఇది మన చేతుల్లోనే ఉందన్నమాట.
కరెంట్ బిల్లు తగ్గాలంటే తొలుత ఇంట్లో మీరు ట్యూబ్‌లైట్ వాడుతుంటే గనుక ఆ స్థానంలో LED బల్బును అమర్చాలి. ప్రస్తుతం మార్కెట్‌లో 2 వాట్స్ నుంచి 40 వాట్ల వరకు కెపాసిటీ ఉన్న ఎల్‌ఈడీ బల్బులు అందుబాటులో ఉన్నాయి. వీటిని కొని వాడుతుంటే కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు.
ఇంకా మీ ఇంట్లో పాత ఫ్యాన్స్ ఉంటే వాటిని రీప్లేస్ చేయాలి. ఈ ఫ్యాన్‌లు 100 నుంచి 140 వాట్ల కెపాసిటీ కలిగి ఉంటాయి. అయితే ఇప్పుడు కొత్త టెక్నాలజీ BLDS ఫ్యాన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి కెపాటిసీ 40 వాట్స్ వరకు ఉంటుంది. ఫ్యాన్లు ఇళ్లలో సాధారణంగా ఎక్కువ సమయం తిరుగుతుంటాయి కనుగ దీంతో కరెంట్ బిల్లును భారీగా తగ్గించుకోవచ్చు.
ఇంకా ఇంట్లో సాధారణ విండో లేదా స్ప్లిట్ AC ఉంటే.. దానిని తీసివేసి ఇన్వర్టర్ AC ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది విద్యుత్ బిల్లును తగ్గించేలా చేయడంలో సహాయపడుతుంది.
COMMENTS