BPSC Teachers Recruitment 2023 : Notification released for 1 lakh 78 thousand teacher jobs.. Anyone from any state can apply
BPSC Teachers Recruitment 2023 : 1 లక్షా 78 వేల టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఏ రాష్ట్రం వాళ్లయినా అప్లయ్ చేసుకోవచ్చు.
Teacher Jobs : నిరుద్యోగులకు ఇది నిజంగానే గుడ్‌న్యూస్. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అర్హత కలిగిన భారత పౌరులు ఎవరైనా ఈ 1.78 లక్షల టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాల్లోకెళ్తే..
ప్రధానాంశాలు:
బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం
1.78 లక్షల టీచర్ పోస్టుల భర్తీ
ఏ రాష్ర్టం వారైనా అప్లయ్ చేసుకోవచ్చు
జులై 12 దరఖాస్తులకు చివరితేది
Bihar Teacher Recruitment 2023 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. 1 లక్షా 78 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో భర్తీ చేయనున్న ఈ టీచర్ పోస్టులకు స్థానికులే కాకుండా ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని బీహార్ ప్రభుత్వం (Government of Bihar) ప్రకటించింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో బీహార్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులకు బీహార్ రాష్ట్రానికి చెందిన వారినే తీసుకునేవారని.. ఈసారి బయట రాష్ట్రాల వారిని కూడా తీసుకోవాలని నిర్ణయించారు.బీహార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అర్హత కలిగిన భారత పౌరులు ఎవరైనా 1.78 లక్షల టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అయితే.. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Bihar Public Service Commission - BPSC) ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో మొత్తం 1,78,026 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 85,477 ప్రైమరీ టీచర్లు, 1745 మాధ్యమిక టీచర్లు, 90,804 హైస్కూల్ టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.
1వ తరగతి నుంచి 5వ తరగతి టీచర్లకు: 18 ఏళ్లు
9వ తరగతి నుంచి 10వ తరగతి, 11వ వ తరగతి నుంచి 12వ తరగతి టీచర్లకు: 21 ఏళ్లు
అన్ రిజర్వ్డ్ పురుష అభ్యర్థులకు: 37 ఏళ్లు
అన్ రిజర్వ్డ్ మహిళా అభ్యర్థులకు: 40 ఏళ్లు
బీసీ,ఈబీసీ, పురుష, మహిళా అభ్యర్థులకు: 40 ఏళ్లు
ఎస్సీ, ఎస్టీ, పురుష, మహిళా అభ్యర్థులకు: 42 ఏళ్లు
జీతభత్యాలు:
ప్రైమరీ టీచర్ (1-5వ తరగతి) మూల వేతనం: రూ. 25 వేలు
సెకండరీ టీచర్ (9-10వ తరగతి) మూల వేతనం: రూ. 31 వేలు
11వ, 12వ తరగతి టీచర్ మూల వేతనం: రూ. 32 వేలు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్షల తేదీ: ఆగస్టు 24 నుంచి ఆగస్టు 27 వరకూ జరుగుతాయి
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 12, 2023
పరీక్ష ఫీజు:
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ. 750/-
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ. 200/-
మహిళలకు: రూ. 200/-
Important Links
Notification Click here
Official Website Click here
COMMENTS