These are the best schemes in post office that get higher interest rate..!!
పోస్టు ఆఫీస్‌లో ఎక్కువ వడ్డీ రేటు వచ్చే బెస్ట్ స్కీమ్స్ ఇవేనండోయ్..!!
చాలా మందికి డబ్బును సేవ్ చేసుకుందాం అని ఉంటుంది. కానీ వాళ్లకు ఎలా సేవ్ చేయాలి, ఎక్కడ చేయాలి అనేది తెలియదు. పోస్టు ఆఫీస్‌లో ఎన్నో రకాల పథకాలు ఉంటాయి. మనకు మాత్రం పోస్ట్ ఆఫీస్ అంటే కేవలం ఉత్తరాలు పంపించుకునేది అని మాత్రమే గుర్తుకు వస్తుంది. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ పథకాలపై అవగాహన ఉంటుంది. ఈ స్కీమ్స్ గురించి తెలిస్తే.. అర్రే ఇన్ని రోజులు అలా ఎలా వేస్ట్ చేశాం టైమ్ అంతా ఎన్ని పైసలు ఒట్టిగా ఖర్చుపెట్టాం ఇందులో పెట్టి ఉంటే ఈ పాటికి ఎన్ని లక్షలు ఐతుండే అని కచ్చితంగా అనుకుంటారు.! మంచి స్కీమ్స్ గురించి ఈరోజు ఓ లుక్కేద్దామా..!
పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎక్కువ వడ్డీ రేటు అందించే బెస్ట్ స్కీమ్స్ లిస్ట్ చెక్ చేయండి. అన్ని అవసరాలకు తగ్గట్లు నిధులు వేర్వేరుగా పొదుపు చేయాలి. లేదా ఎప్పుడైనా డబ్బు వెనక్కు తీసుకోగలిగే మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. ఇందుకు పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.
వీటిలో చేసే పెట్టుబడులపై ఎలాంటి నష్ట భయం ఉండదు. వడ్డీకి ప్రభుత్వ హామీ సైతం ఉంటుంది. ఫ్లెక్సిబుల్ విత్‌డ్రా ఆప్షన్‌తో ఇవి సాధారణ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. మీరు కూడా ఇలాంటి పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ఎక్కువ వడ్డీ రేటు అందించే బెస్ట్ స్కీమ్స్ లిస్ట్ చెక్ చేయండి.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్ : ఇది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ మాదిరిగానే ఉంటుంది. స్కీమ్ కాల వ్యవధి ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన లెక్కిస్తారు. కానీ ఆ మొత్తాన్ని ఏటా చెల్లిస్తారు. 2023-24 రెండో త్రైమాసికానికి (జులై నుంచి సెప్టెంబర్ 2023 వరకు) వడ్డీ రేట్లు ఒక సంవత్సరం అకౌంట్‌కు 6.9 శాతం; రెండు, మూడు సంవత్సరాల అకౌంట్లకు 7 శాతం, ఐదేళ్ల అకౌంట్‌కు 7.5 శాతం చొప్పున ఉన్నాయి.
ఐదేళ్ల పోస్టాఫీస్ RD : ఐదు సంవత్సరాల ఫిక్స్‌డ్ టెన్యూర్‌తో వచ్చే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్లో రూ. 100 నుంచి నెలవారీ డిపాజిట్లు చేయవచ్చు. ఈ నిధులపై 6.5 శాతం చొప్పున వడ్డీ పొందవచ్చు. ఈ స్కీమ్‌లో వడ్డీని త్రైమాసిక ప్రాతిపదికన లెక్కిస్తారు.
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్ (MIS) : మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్ (MIS) అనేది, డిపాజిట్లపై లబ్ధిదారులకు నెలవారీ వడ్డీని అందిస్తుంది. ఈ స్కీమ్ ప్రస్తుత వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది. అయితే దీనికి ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.
పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ : పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌పై సంవత్సరానికి 4 శాతం వడ్డీ లభిస్తుంది. అయితే దీనిపై అందే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. కానీ TDS (మూలం వద్ద పన్ను కోత) మాత్రం వర్తించదు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (NSC) : ఇది ఐదు సంవత్సరాల కాలవ్యవధితో వచ్చే పోస్టల్ స్కీమ్. NSC ప్రస్తుత వడ్డీరేటు 7.7 శాతంగా ఉంది. వడ్డీ రేటును సంవత్సర ప్రాతిపదికన లెక్కిస్తారు. ఆ మొత్తాన్ని మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు.
కిసాన్ వికాస్ పత్ర (KVP): KVPలో పెట్టే పెట్టుబడి 123 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఈ స్కీమ్ ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7 శాతంగా ఉంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) : ఇది ప్రభుత్వ పదవీ విరమణ పథకం. ఈ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్లు ఒకేసారి ఏకమొత్తంలో డిపాజిట్లు చేయవచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది. ఈ వడ్డీని ప్రతి త్రైమాసికానికి చెల్లిస్తారు.
15 సంవత్సరాల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (PPF) : జీతాలు అందుకునే వేతన జీవులకు ఈ స్కీమ్ మంచి పెట్టుబడి మార్గం. రిటైర్‌మెంట్ ఫండ్స్ కోసం PPF మంచి పథకం. అలాగే సెక్షన్ 80C కింద ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు (డిడక్షన్) సైతం పొందవచ్చు. ఈ పథకం వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. నిధులపై కాంపౌండ్ వడ్డీని వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు. ఈ వడ్డీపై ఎలాంటి ట్యాక్స్ వర్తించదు.
సుకన్య సమృద్ధి అకౌంట్లు (SSA) : ఇది పది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం. ఈ స్కీమ్ వడ్డీరేటు 8 శాతంగా ఉంది. ఈ కాంపౌండ్ వడ్డీని సంవత్సర ప్రాతిపదికన లెక్కిస్తారు.
COMMENTS