SCSS Vs Bank FD: Which is the best scheme for senior citizens.. Do you know where the high interest comes from?
SCSS Vs Bank FD: వృద్ధులకు ఏది బెస్ట్ స్కీమ్.. అధిక వడ్డీ ఎక్కడ వస్తుందో తెలుసా?
భవిష్యత్తు అవసరాల కోసం ప్రజలు డబ్బులు దాచుకోడానికి ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ సేవింగ్స్ ఖాతాలో అలా డబ్బును వదిలేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకోసమే సురక్షిత పెట్టుబడి పథకాలైన స్మాల్ సేవింగ్స్ ప్లాన్స్ వైపు చాలా మంది మొగ్గుచూపుతారు. దీనిలో రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్స్ తమ డబ్బులను ఇలా ఆదా చేసుకోడానికి ఇష్టపడతారు. ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ను ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. వడ్డీ రేట్లను ప్రతి క్వార్టర్ కి రివైజ్ చేస్తుంది. వీటిల్లో ప్రధానమైనది బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లు. ఈ ఫిక్స్ డ్ డిపాజిట్లలో 0.50 నుంచి 0.75శాతం వరకూ వడ్డీ రేటు వస్తుంది. అలాగే వృద్ధులకు అందుబాటులో ఉన్న మరో ఆప్షన్ సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్). ఇది అత్యంత జనాదరణ పొందిన పథకమే. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఎఫ్ డీ, ఎస్సీఎస్ఎస్ పథకాలలో ఏది బెస్ట్? దేనిలో వృద్ధులకు అధిక ప్రయోజనాలు వస్తాయి? తెలుసుకుందాం రండి..
సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్..
2023, జూలై నుంచి సెప్టెంబర్ క్వార్టర్ లో ఈ సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును ప్రభుత్వ యథాతథంగా ఉంచింది. అంటే కేవలం 8.2శాతాన్ని అలాగే కొనసాగించింది. దీనిలో ఒక అకౌంట్ పై కనీసం రూ.1000 నుంచి రూ. 30లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. 60ఏళ్ల దాటిన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులే. దీనిలో ఇన్ కమ్ ట్యాక్స్ చట్టం 1961 , సెక్షన్ 80సీ ప్రకారం ప్రయోజనాలను పొందుకుంటారు. ఈ అకౌంట్ ఐదేళ్ల కాలపరిమితితో ఈ ఖాతా ఆపరేట్ అవుతుంది. పోస్ట్ ఆఫీసులో మాత్రమే దీనిని నిర్వహించగలం. ప్రభుత్వం ప్రతి క్వార్టర్ కి అంటే మార్చి 31/ జూన్30/సెప్టెంబర్ 30/ డిసెంబర్ 31న వడ్డీని జమచేస్తుంది.
ఐదేళ్ల ఫిక్స్ డ్ డిపాజిట్..
ఐదేళ్ల కాలపరిమితితో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే ఆయా బ్యాంకులను బట్టి వడ్డీ రేటు పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాన బ్యాంకులపైన ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్, ఎస్ బ్యాంక్ లలో వడ్డీ రేట్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఈ బ్యాంకులో ఐదేళ్ల ఫిక్స్ డ్ డిపాజిట్ పై సీనియర్ సిటీజెన్స్ కు 7.5శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే ఇదే బ్యాంకులో అమృత్ కలష్ అనే పథకం ఉంది. ఆ పథకంలో అయితే వృద్ధులకు 7.60శాతం వడ్డీ రేటు వస్తుంది. దీనిలో ఖాతా ప్రారంభించేందుకు 2023, ఆగస్టు 15 వరకూ సమయం ఉంది.
హెచ్ డీఎఫ్సీ బ్యాంకు.. ఈ బ్యాంకులో వృద్ధులకు ఫిక్స్ డ్ డిపాజిట్ పై 7.75శాతం వడ్డీ లభిస్తుంది. కాలపరిమితి ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకూ ఉంటుంది.
ఐసీఐసీఐ బ్యాంక్.. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజెన్స్ కు ఎఫ్ డీలపై 7.60శాతం వడ్డీ రేటు వస్తుంది. దీని టెన్యూర్ ఐదేళ్ల ఒక రోజు నుంచి 10 ఏళ్లు ఉంటుంది.
యాక్సిస్ బ్యాంక్.. దీనిలో కూడా సీనియర్ సిటీజెన్స్ కు తమ ఎఫ్ డీలపై 7.75 నుంచి 8శాతం వరకూ వడ్డీ వస్తుంది. కాల పరిమితి 18 నెలల నుంచి 5 ఐదేళ్ల వరకూ ఉంటుంది.
ఎస్ బ్యాంక్.. ఈ బ్యాంకులో వడ్డీ రేట్లు 7.75శాతం వరకూ ఉంటాయి. 60 నెలల నుంచి 120 నెలల టెన్యూర్ దీనిలో ఉంటుంది.
COMMENTS