Basara RGUKT Jobs: Teaching and Non-Teaching Jobs in Basara Triple IT Campus.. Full Details
Basara RGUKT Jobs: బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ) తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు జులై 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు, విభాగాల వివరాలు..
గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు.. సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్, తెలుగు విభాగాల్లో ఖాళీలున్నాయి.
గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు.. కెమికల్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లిష్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు.. కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, నెట్, స్లెట్, సెట్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై వారు దరఖాస్తుకు అర్హులు. ఆసక్తి కలిగిన వారు జులై 30, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గెస్ట్ ల్యాబ్ అసిస్టెంట్/ గెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్‌కు రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైతే నెలకు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు రూ.33,000 నుంచి రూ.37,000, గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు రూ.17,500, గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులకు రూ.14,500 వరకు జీతంగా చెల్లిస్తారు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR APPLY
Guest faculty in Engineering : https://forms.gle/KrutWbFqE38AgKY17
Guest Faculty in Science & Humanities: https://forms.gle/HDsnz7hQcY6iPGDz8
Guest Laboratory Assistant : https://forms.gle/u6gqfHHz7JLGTwhQ8
Guest Laboratory Technician : https://forms.gle/DzUrDKdLkeXAmDYj9
COMMENTS