AP Job Mela: Alert for unemployed in AP.. Another Job Mela on 25th of this month.. Registration link is this.
AP Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఈ నెల 25న మరో జాబ్ మేళా.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 25న మరో జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాలో హెటెరో డ్రగ్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థలు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగావకశాలను కల్పించనున్నాయి.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
హెటెరో డ్రగ్స్: ఈ సంస్థలో 80 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్/QC/QA/R&D విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ, బీకామ్, బీఏ/ఎంఎస్సీ, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం ఉంటుంది.
డెక్కన్ ఫైన్ కెమిస్ట్ లిమిటెడ్: ఈ సంస్థలో 120 ఖాళీలు ఉన్నాయి. ట్రైనీ కెమిస్ట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ, ఎంఎస్సీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,477 నుంచి రూ.21,165 వరకు వేతనం ఉంటుంది.
@AP_Skill has Conducting Mini Job Mela at Government Model Degree College, Near Fire Station #Cheepurupalli @vzmgoap
Registration Linkhttps://t.co/5Ies8JJ25m Contact Srinu - 9010023033 Srinu - 9490219337 Bhaskar - 9000102013 APSSDC Helpline - 9988853335 pic.twitter.com/Bl8tKaXfDx — AP Skill Development (@AP_Skill) July 21, 2023
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 25న ఉదయం 10 గంటలకు గవర్నమెంట్ మోడల్ డిగ్రీ కాలేజీ, ఫైర్ స్టేషన్ దగ్గర, చీపురుపల్లిలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ఇతర వివరాలకు 9010023033 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
COMMENTS