Annually Rs. 399 if you pay Rs. 10 lakh accident insurance
Group Accident Protection Insurance Policy : ఏటా రూ. 399 చెల్లిస్తే రూ. 10 లక్షల ప్రమాద బీమా.
చాలామంది వచ్చే డబ్బు వచ్చినట్లే పోతుంది. అసలు సేవింగ్స్ చేద్దాం అన్నా ఏం మిగలడం లేదు అని తెగ బాధపడుతుంటారు. మీరు నిజంగా సేవింగ్స్ చేయాలనుకుంటే ఇన్యూరెన్స్ చేయండి. ప్రమాద బీమాలను ఎంచుకోండి. అబ్బో వీటికి కట్టాల్సిన ప్రీమియంలు ఎక్కువగా ఉంటాయి. అంత సేవింగ్స్ మాతోని లేవు అంటారా..? సంవత్సరానికి 399 ప్రీమియం తీసుకుంటే.. 10 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు తెలుసా..? జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇలాంటి ఒక చిన్న ప్రీమియం తీసుకుంటే కుటుంబంలో ఏదైనా జరగరానిది జరిగితే మరీ అప్పుల్లో కుంగిపోకుకండా ఉండొచ్చు కదా..!
గ్రూప్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ పాలసీ (Group Accident Protection Insurance Policy) పేరుతో టాటా ఏఐజీ తో కలిసి ఇండియా పోస్ట్ తీసుకువచ్చింది. ఏటా రూ. 399 ల నామమాత్ర ప్రీమియం చెల్లించడం ద్వారా రూ. 10 లక్షల ఈ ప్రమాద బీమా పొందవచ్చు. ఈ అవకాశాన్ని భారత ప్రభుత్వ పోస్టల్ విభాగం కల్పిస్తోంది. ఈ ‘ఇండియా పోస్ట్ ()’ పాలసీలో రెండు ప్రీమియం ఆప్షన్లు ఉన్నాయి. అవి రూ. 299 ప్రీమియం ఆప్షన్ కాగా, మరొకటి రూ. 399 ల ప్రీమియం ఆప్షన్. ఈ ప్రీమియంను ప్రతీ సంవత్సరం చెల్లించాల్సి ఉంటుంది. అందుకు గానూ, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ ఉండాలి.
ప్రయోజనాలు ఇవేనండోయ్..
- రూ. 299 ప్రీమియం ఆప్షన్ తో ఈ పాలసీ తీసుకుంటే లభించే ప్రయోజనాలు ఇవి..
- బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదంలో చనిపోతే, ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షలు అందుతాయి.
- ఒకవేళ ప్రమాదంలో గాయపడితే రూ. 60 వేలు ఆసుపత్రిలో చికిత్సకు (IPD), అనంతరం, రూ. 30 వేలు ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయిన తరువాత చికిత్సకు (OPD) అందజేస్తారు.
- ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పూర్తిగా కదల్లేని స్థితిలో పాలసీదారు ఉంటే కూడా అతడికి రూ. 10 లక్షలు అందజేస్తారు.
- ప్రమాదంలో పాలసీదారు చనిపోతే, అంత్యక్రియల కోసం వెంటనే రూ. 5 వేలు అందజేస్తారు. పాలసీదారు కుటుంబ సభ్యులు వేరే నగరంలో ఉంటే, వారికి ప్రయాణ ఖర్చులు అందిస్తారు.
- రూ. 399 ప్రీమియం ఆప్షన్ తో ఇదే పాలసీ తీసుకుంటే, పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు, అదనంగా.. ప్రమాదంలో మృతి చెందిన పాలసీదారు ఇద్దరు పిల్లలకు విద్యాఖర్చుల నిమిత్తం రూ. 1 లక్ష చొప్పున అందజేస్తారు.
చాలా మంచిది కదా..! ఎన్నో అనవసరమైన ఖర్చులు చేస్తుంటాం. కేవలం 400 వీటిమీద పెడితే తప్పేంలేదు. మీరు వెంటనే ఈ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని జాయిన్ అవ్వండి. ప్రమాదాలు చెప్పిరావు అందుకే వాటికి ప్రిపేర్డ్‌గా ఉండాలి.
COMMENTS