Anganwadi Jobs : Anganwadi Jobs Notification Released.. 10th Pass Candidates Eligible.. No Written Exam
Anganwadi Jobs : అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 10వ తరగతి పాసైన వాళ్లు అర్హులు.. రాతపరీక్ష లేదు.
WDCW AP Anganwadi Jobs 2023 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అలాగే.. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి స్థానిక వివాహిత మహిళై ఉండాలి. మరిన్ని వివరాల్లోకెళ్తే..
మొత్తం పోస్టులు: 40
అంగన్వాడీ వర్కర్ - 03
మినీ అంగన్వాడీ వర్కర్ - 01
అంగన్వాడీ హెల్పర్ - 36
ముఖ్య సమాచారం:
ఐసీడీఎస్ ప్రాజెక్టు పేరు: అనంతపురం అర్బన్, అనంతపురం రూరల్, సింగనమల, నార్పల, తాడిపత్రి, గుత్తి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, కణేకల్లు, కంబదూరు, రాయదుర్గం.
విద్యార్హతలు: పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 2023 జూలై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
అంగన్వాడీ వర్కర్: 11,500/-
మినీ అంగన్వాడీ వర్కర్: 7,000/-
అంగన్వాడీ హెల్పర్: 7,000/-
ఎంపిక విధానం: పదవ తరగతిలో సాధించిన మార్కులు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తులకు చివరితేది : జూలై 19, 2023.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
COMMENTS