Pan Card Holders: IT department's key announcement for pan card holders.. This is the latest update..
Pan Card Holders: పాన్ కార్డు హోల్డర్లకు ఐటీ శాఖ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..
Pan Card Holders: ఆధార్- పాన్ అనుసంధానం గడువు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఆదాయపు పన్ను మంత్రిత్వ శాఖ పాన్ కార్డు హోల్డర్లకు మరో కీలక సూచన ఇచ్చింది. పాన్ కార్డు పనిచేయని వారు కూడా జులై 31లోగా పన్ను చెల్లించొచ్చని పేర్కొంది. ఇదే సమయంలో NRI ల పాన్‌కు సంబంధించి కూడా కీలక ప్రకటన చేసింది.
Pan Card Holders: ఆధార్- పాన్ లింక్ గడువు ముగిసిన నేపథ్యంలో ఐటీ శాఖ మరోసారి కీలక ప్రకటన చేసింది. పాన్ కార్డు పనిచేయని వారు కూడా ఈ జులై 31 వరకు టాక్స్ చెల్లించొచ్చని స్పష్టం చేసింది. పనిచేయని పాన్.. అంటే పాన్ కార్డు ఇనాక్టివ్‌లో ఉన్నట్లు కాదని క్లారిటీ ఇచ్చింది. అందుకే పాన్ కార్డు పనిచేయకపోయినా.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయొచ్చని పేర్కొంది. ఇక ఇప్పటికే పాన్- ఆధార్ లింక్ పూర్తి చేయని వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోనున్నట్లు హెచ్చరించింది కూడా. అయితే NRIలు, OCI లకు ఆధార్- పాన్ లింకింగ్ నుంచి మినహాయించినట్లు స్పష్టం చేసింది. వీరి ఆందోళనలపైనా తాజాగా స్పందించింది.
ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోవడం వల్ల పాన్ కార్డు చెల్లుబాటులో లేని ప్రవాస భారతీయులు (NRI) వీలైనంత తొందరగా పన్ను అధికారుల్ని సంప్రదించాలని ఆదాయపు పన్ను శాఖ సూచించింది. ఇప్పటికే చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు.. తన పాన్ కార్డు పనిచేయడం లేదని ఫిర్యాదులు లేవనెత్తిన నేపథ్యంలోనే ఐటీ విభాగం ట్విట్టర్‌లో తాజాగా స్పందించింది. ఎన్నారైలు, ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా (OCI) వారి పాన్ కార్డు పనిచేయకపోవడంపై ఆందోళన చెందుతున్నట్లు అందులో వివరించింది.
అయితే.. NRI లు గత మూడు మదింపు సంవత్సరాల్లో ఏ ఒక్క ఏడాది రిటర్న్స్ దాఖలు చేసినా.. లేదా వారి నివాస స్థితి తెలియజేసినా దానిని పాన్ కార్డుకు మ్యాప్ చేసినట్లు తెలిపింది. తన నివాస స్థితి తెలియజేయని NRI ల పాన్ కార్డులు మాత్రమే పనిచేయట్లేదని ఐటీ శాఖ పేర్కొంది. ఇలాంటి పరిస్థితి ఎదురైన వారు తమ నివాస స్థితి తెలియజేస్తూ.. సంబంధిత పన్ను మదింపు అధికారిని (JAO) సంప్రదించాలని సూచించింది. ఇక ఇప్పటికీ ఆధార్- పాన్ లింక్ చేసుకోవచ్చు. దీని కోసం రూ. 1000 వరకు జరిమానా చెల్లించాలి. ఇంకా అధికారులకు రిక్వెస్ట్ పెట్టుకోవాలి.
COMMENTS