Rs 500 Notes: 2000 note gone.. Next Rs. 500 note? Again Rs. 1000 notes coming? Center with a clear plan..
Rs 500 Notes: 2000 నోటు పోయింది.. నెక్ట్స్ రూ. 500 నోటేనా? మళ్లీ రూ. 1000 నోట్లు వస్తున్నాయా? కేంద్రం పక్కా ప్లాన్‌తో..
1000 Banknotes Reintroduced: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రూ. 2000 నోట్లను చలామణి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా ఎక్స్చేంజ్ చేసుకోవాలని సూచించింది. అయితే ఇప్పుడు మళ్లీ రూ. 500 బ్యాంక్ నోట్లను రద్దు చేస్తుందా? రూ. 1000 నోట్లను మళ్లీ తీసుకొస్తుందా? కేంద్రం దీనిపై స్పందించింది.
Currency Notes: గతంలో కేంద్ర ప్రభుత్వం తొలిసారి రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కొత్త ప్రింటింగ్‌తో రూ. 500 నోటు, రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టింది. ఇక ఇటీవల మే నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 కరెన్సీ నోట్లను కూడా చలామణి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఆ నోట్లు చెల్లుబాటు అవుతాయని.. సెప్టెంబర్ 30 కల్లా ఆ నోట్లను బ్యాంకుల్లో ఎక్స్చేంజ్ లేదా డిపాజిట్ చేయాలని సూచించింది. అయితే ఈ సమయంలోనే కేంద్రం రూ. 500 నోట్లను కూడా రద్దు చేస్తుందని.. రూ. 1000 నోట్లను ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి ప్రవేశపెట్టాలని చూస్తోందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పుడు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పలువురు ప్రశ్నలు లేవనెత్తారు.
దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ స్పందించారు. ఇప్పుడు కరెన్సీ నోట్లలో అత్యధిక విలువ ఉన్న నోట్లను రద్దు చేయడం అనే వార్తలను ఆయన ఖండించారు. అంటే రూ. 500 నోట్లను రద్దు చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతానికి లేదని ఆయన చెప్పారు. ఇక ఇదే సమయంలో ఆయనకు రూ. 1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే యోచన ఉందా అనే ప్రశ్న కూడా ఎదురైంది. దానికి పంకజ్ చౌదరీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
''రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. నగదు ఉపసంహరణ అనేది.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లేదా ఆర్థిక వ్యవస్థలో ఏదైనా అంతరాయాలు/అవాంతరాలను నివారించేందుకు ప్రణాళిక చేసిన ఒక కరెన్సీ మేనేజ్‌మెంట్ ఆపరేషన్. ఇక ప్రస్తుతానికి రూ. 2000 నోట్ల ఉపసంహరణ జరుగుతోంది. ఇంకా సర్క్యులేషన్‌లో ప్రస్తుతానికి తగినంత, అవసరానికి సరిపడా బ్యాంక్ నోట్ల బఫర్ స్టాక్ ఉంది.'' అని చెప్పారు పంకజ్. దీనిని బట్టి రూ. 1000 నోట్లను కూడా చలామణిలోకి తీసుకొచ్చే యోచనలో కేంద్రం లేదని అర్థమవుతోంది.
మే నెలలో RBI రూ. 2000 నోట్ల ఉపసంహరణ ప్రకటన చేసే సమయానికి అప్పటికీ సర్క్యులేషన్లో వీటి వాటా రూ. 3.56 లక్షల కోట్లుగా ఉంది. ఇక ఇది జూన్ చివరి నాటికి రూ.0.84 లక్షల కోట్లకు తగ్గినట్లు చెప్పింది కేంద్రం. ఇక వీటి ఉపసంహరణకు చివరి తేదీ సెప్టెంబర్ 30 అని.. ఆ తర్వాత పొడిగించే యోచనలో కూడా లేదని పేర్కొంది.
COMMENTS