WhatsApp New Feature: Another stunning update from WhatsApp.. Let's talk more..
WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో స్టన్నింగ్ అప్ డేట్.. ఇక మాట్లాడుకోటాల్లేవ్..
వాట్సాప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. అందుకే రోజురోజుకీ దాని వినియోగదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వినియోగదారుల అవసరాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సరికొత్త ఫీచర్లను ప్రముఖ మేసేజింగ్ యాప్ తీసుకొస్తూనే ఉంది.
మెటా ఆధ్వర్యంలోకి వెళ్లాక ఫీచర్ల సంఖ్య మరింత పెరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు మరో ఆకర్షణీయమైన ఫీచర్ ను తీసుకొచ్చింది. సరికొత్త కీ బోర్డును ప్రవేశపెట్టింది. దానిలో ఎమోజీలను ప్రవేశపెట్టింది. ఇకపై మాటల్లేవ్, మాట్లాడుకోవటాల్లేవ్.. కేవలం ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే ఉంటాయి అనేలా దీనిని అప్ డేట్ చేసింది. అయితే ప్రస్తుతం ఇది కొన్ని బీటి వెర్షన్లకు మాత్రమే అందుబాటులో ఉంచింది. వాట్సాప్ కొత్త ఫీచర్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
వాట్సాప్ ఎమోజీ కీబోర్డు..
రీడిజైన్డ్ ఎమోజీ కీబోర్డుగా పిలిచే ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు ఎమోజీ కీబోర్డును పైకి స్క్రోల్ చేయడం కుదురుతుంది. కొత్త ఫీచర్‌కు సంబంధించిన వివరాలను ప్రముఖ వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. ఆ రిపోర్టు ప్రకారం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.23.12.19 అప్‌డేట్‌లో కొత్త కీబోర్డ్ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఇన్‌స్టాల్ చేసుకున్న యూజర్లు ఆ కీబోర్డును యాక్సెస్ చేయవచ్చు. ఈ కొత్త ఎమోజీ కీబోర్డును వారు పైకి స్క్రోల్ చేయడం కుదురుతుంది. సాధారణంగా స్టాండర్డ్ వాట్సాప్ వెర్షన్‌లో అందుబాటులో ఉన్న ఎమోజీ కీబోర్డ్‌ను ఓపెన్ చేశాక అందులో ఉన్న ఎమోజీలు కిందకి, పైకి స్క్రోల్ చేయవచ్చు. కానీ ఆ కీబోర్డ్‌ను అంతటా పైకి స్క్రోల్ చేసే వెసులుబాటు లేదు. అయితే కొత్త రీడిజైన్డ్ కీబోర్డును మాత్రం పైకి డ్రాగ్ చేయవచ్చు. ఆ విధంగా ఎమోజీల డిస్‌ప్లేకు సంబంధించి వైడర్ వ్యూ పొందొచ్చు. వైడర్ వ్యూలో ఒకేసారి చాలా ఎమోజీలు కనిపించడం వల్ల కావాల్సిన ఎమోజీని వెంటనే సెలెక్ట్ చేసుకోవడం సాధ్యమవుతుంది.
మార్పులు ఇవి..
కొత్తగా వాట్సాప్ తీసుకొచ్చిన ఈ రీడిజైన్డ్ ఎమోజీ కీబోర్డ్‌లో మరొక మార్పును కూడా మనం
గమనించవచ్చు. ఎమోజీలు, గిఫ్స్, స్టిక్కర్స్, అవతార్స్ వంటి ట్యాబ్స్‌ను కొత్త ఎమోజీ కీబోర్డ్‌లో పైన భాగంలో చేర్చింది. స్టాండర్డ్ యాప్ వెర్షన్‌లో ఈ ట్యాబ్స్ అనేవి కింది భాగంలో ఉన్నాయి. ఇక కొంతమంది బీటా టెస్టర్లు మీడియా షేరింగ్, ఎమోజీ కీబోర్డ్ బటన్‌ల కొత్త అరేంజ్‌మెంట్స్ కూడా ట్రై చేయవచ్చు.ఈ రీడిజైన్డ్ ఎమోజీ కీబోర్డు కేవలం కొందరు బీటా టెస్టర్లకు మాత్రమే రిలీజ్ అయింది. మిగిలిన యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
COMMENTS