TS Teacher Recruitment 2023: 1218 Teaching Staff Vacancies in KGBVs and 23 Teaching Staff Vacancies in URS (Total Vacancies: 1241) – Full Details Here
టీఎస్ టీచర్ రిక్రూట్‌మెంట్ 2023: కేజీబీవీ లలో 1218 మరియు URS లలో 23 టీచింగ్ స్టాఫ్ ఖాళీలు (మొత్తం ఖాళీలు:1241) – పూర్తి వివరాలు ఇవే.
తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) లో 1,241 మంది మహిళా కాంట్రాక్టు అధ్యాపకులను నియమించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 16న నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 475 కేజీబీవీలు ఉన్నాయి. ప్రస్తుతం 42 స్పెషల్ ఆఫీసర్లు, 849 పీజీ సీఆర్టీలు, 273 సీఆర్టీలు, 77 పీఈటీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి..
నియామక వివరాలు
జూన్ 26 నుంచి జులై 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత సమగ్ర నోటిఫికేషన్ జూన్ 17న విడుదల చేశారు. జులైలో ఆన్లైన్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రంలో బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ): ఈ పోస్టులకు మహిళా అభ్యర్ధులు మాత్రమే అర్హులు
1. స్పెషల్ ఆఫీసర్- 38
2. పీజీసీఆర్టీ (ఇంగ్లిష్)- 110
3. పీజీసీఆర్టీ (గణితం)- 60
4. పీజీసీఆర్టీ (నర్సింగ్) - 160
5. పీజీసీఆర్టీ (తెలుగు) – 104
6. పీజీసీఆర్టీ (ఉర్దూ) - 2
7. పీజీసీఆర్టీ (వృక్షశాస్త్రం) - 55
8. పీజీసీఆర్టీ (కెమిస్ట్రీ) - 69
9. పీజీసీఆర్టీ (సివిక్స్) - 55
10. పీజీసీఆర్టీ (కామర్స్) – 70
11. పీజీసీఆర్టీ (ఎకనామిక్స్) - 54
12. పీజీసీఆర్టీ (ఫిజిక్స్) - 56
13. పీజీసీఆర్టీ (జంతుశాస్త్రం) - 54
14. సీఆర్టీ (బయో సైన్స్) - 25
15. సీఆర్టీ (ఇంగ్లిష్) – 52
16. సీఆర్టీ (హిందీ)- 37
17. సీఆర్టీ (గణితం) - 45
18. సీఆర్టీ (ఫిజికల్ సైన్స్)- 42
19. సీఆర్టీ (సోషల్ స్టడీస్) - 26
20. సీఆర్టీ (తెలుగు)- 27
21. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్- 77
అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్ఎస్): పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు
1. స్పెషల్ ఆఫీసర్- 4
2. సీఆర్టీ (తెలుగు) - 5
3. సీఆర్టీ (ఇంగ్లిష్) – 5
4. సీఆర్టీ (సైన్స్) – 6
5. సీఆర్టీ (సోషల్ స్టడీస్) - 3
మొత్తం పోస్టుల సంఖ్య: 1,241.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ / బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) / యూజీపీఈడీ / బీపీఎడ్ ఉత్తీర్ణతతోపాటు టెట్/ సీటెట్ అర్హత సాధించి ఉండాలి.
వయస్సు: 01.07.2023 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ / ఎస్టీ / బీసీ /ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు అయిదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
సీఆర్టీ పోస్టులు: రాత పరీక్ష (80% వెయిటేజీ), టెట్(20% వెయిటేజీ)లో పొందిన మార్కుల ఆధారంగా.
స్పెషల్ ఆఫీసర్: రాత పరీక్ష (75% వెయిటేజీ), టెట్(20% వెయిటేజీ), పని అనుభవం (5% వెయిటేజీ)లో సాధించిన మార్కుల ఆధారంగా.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
పీజీసీఆర్టీ పోస్టులు: రాత పరీక్ష (95% వెయిటేజీ), పని అనుభవం (5% వెయిటేజీ)లో పొందిన మార్కుల ఆధారంగా.
పీఈటీ పోస్టులు: రాత పరీక్ష(100% వెయిటేజీ)లో సాధించిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ. 600.
ముఖ్యమైన తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 26.06.2023 నుంచి 05.07.2023 వరకు.
స్పెషల్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్ష (ఆన్లైన్): జులై, 2023.
పీజీసీఆర్టీ పోస్టుల రాత పరీక్ష (ఆన్లైన్): జులై, 2023.
సీఆర్డీ, పీఈటీ రాత పరీక్ష (ఆన్లైన్): జులై, 2023.
IMPORTANT LINKS :
COMMENTS