Ten, Inter fail.. Now salary Rs. 3 lakh per month.. Hearing his success story is shocking!
పది, ఇంటర్ ఫెయిల్.. ఇప్పుడు నెలకు రూ.3 లక్షల వేతనం.. ఇతని సక్సెస్ స్టోరీ వింటే షాకవ్వాల్సిందే!
సాధారణంగా పరీక్షల్లో ఎవరైనా ఫెయిల్ అయితే వాళ్లు ఎందుకూ పనికిరారని జీవితంలో సక్సెస్ కావడం అసాధ్యమని అందరూ భావిస్తారు. అయితే పది, ఇంటర్ ఫెయిలైనా ఒక వ్యక్తి ఇప్పుడు ఏకంగా నెలకు 3 లక్షల రూపాయల వేతనం అందుకుంటున్నారు.
సామాన్య కుటుంబంలో జన్మించిన వైకుంఠం ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించినా ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నెలకు 3 లక్షల రూపాయల వేతనం అందుకుంటున్నారు.
పేద కుటుంబంలో జన్మించిన వైకుంఠం ( vaikuntam )ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. అయితే అటు ఇంగ్లీష్ ఇటు మ్యాథ్స్ పై పట్టు లేకపోవడంతో పదో తరగతిలో, ఇంటర్ లో వైకుంఠం ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత కూడా ఆ సబ్జెక్ట్ లలో ఫెయిల్ కావడం వైకుంఠంను బాధ పెట్టింది. అయితే లైఫ్ లో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే కసి మాత్రం అతనిలో ఉండేది. ఒకవైపు ఆటో డ్రైవర్ గా పని చేస్తూనే ట్యూషన్ కు వెళ్లిన వైకుంఠం ప్రస్తుతం నెలకు 3 లక్షల జీతంతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా( Pedapalli district )లోని లొంకకేసారం వైకుంఠం సొంతూరు కాగా పది మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యానని రెండుసార్లు రాసి పాస్ అయ్యానని వైకుంఠం తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆటో నడుపుకోవాలని కుటుంబ సభ్యులు సూచించారని వైకుంఠం చెప్పుకొచ్చారు. ట్యూషన్ కు వెళ్లి ఇంటర్ పాస్ అయ్యానని 1990లో కిట్స్ కాలేజ్(KITS ) లో బీటెక్ చేరానని ఆయన తెలిపారు.
స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ తీసుకుని ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడటం నేర్చుకున్నానని ఆ తర్వాత బీటెక్ పూర్తి చేశానని వైకుంఠం అన్నారు. ప్రస్తుతం క్వాలిటీ మేనేజర్ గా పని చేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అబుదాబి( Abu Dhabi )లో వైకుంఠం ఉద్యోగం చేస్తున్నారు. ఎన్నోసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనా కష్టపడి సక్సెస్ అయ్యానని ఆయన చెప్పుకొచ్చారు.
COMMENTS