Tech Job Market: Lots of opportunities for talented Indians.
Tech Job Market: టాలెంట్ ఉన్న ఇండియన్స్ కి అవకాశాలు బోలెడు.. జాబ్ మార్కెట్ లో వారికి తిరుగులేదంతే..!
బోట్ ఇండియన్ బ్రాండ్. కంపెనీ ప్రొడక్టులు అన్నీ 100% ఇండియాలో తయారు చేయకపోయినా, దాదాపు 75% ప్రొడక్టులు స్థానికంగా తయారవుతాయని మెహతా స్పష్టం చేశారు. కొన్ని సంవత్సరాలుగా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్‌పై బోట్ ప్రధానంగా దృష్టి పెట్టిందన్నారు. మరోవైపు డాల్బీ వివిధ రంగాల్లో ఫుట్‌ప్రింట్‌ను విస్తరిస్తోంది. ఈ రెండు సంస్థలు పార్ట్నర్‌షిప్‌తో కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నాయి. తాజాగా బోట్ నిర్వాణ 525 ANC నెక్‌బ్యాండ్‌ను లాంచ్ చేయగా.. ఆ సందర్బంగా సమీర్, కరణ్‌ను ఇండియా టుడే టెక్ టీమ్ ఇంటర్వ్యూ చేసింది.
ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్
boAt Nirvana 525 ANC నెక్‌బ్యాండ్‌ను ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేశామని మెహతా చెప్పారు. డాల్బీతో పార్ట్‌నర్‌షిప్ సౌండ్ పర్సనైజేషన్, హైబ్రిడ్ ANC వంటి ప్రత్యేక ఫీచర్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడిందని తెలిపారు. బోట్‌తో కొనసాగుతున్న ప్రయాణం, అసాధారణమైన ఆడియో టెక్నాలజీని భారతీయ వినియోగదారులకు అందించడంలో సహాయపడుతుందని గ్రోవర్ చెప్పారు.
ఇండియా స్టార్టప్ ఎకోసిస్టమ్ శక్తివంతమైనదని, అవసరమైన నైపుణ్యాలు, అనుభవం ఉన్నవారికి సమృద్ధిగా అవకాశాలను అందిస్తుందని మెహతా చెప్పారు. మార్కెట్ హై-క్వాలిటీ ట్యాలెంట్‌ను కోరుతోందని, క్వాలిఫైడ్ ఇండివిడ్యువల్స్‌కి ఉద్యోగాల కొరత ఏర్పడదని చెప్పారు. ఎకోసిస్టమ్ కంపెనీగా డాల్బీ, కంటెంట్ క్రియేటర్స్, స్టూడియోలు, డివైజెస్, OTT ప్లాట్‌ఫారమ్‌లలో తన పరిధిని నిరంతరం విస్తరిస్తుందని గ్రోవర్ హైలైట్ చేశారు. ఫలితంగా స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వివిధ డొమైన్‌లలో రాణించడానికి పుష్కలమైన అవకాశాలు ఉంటాయన్నారు.
ప్రతి స్థాయిలోనూ బెస్ట్ ప్రొడక్ట్
బోట్ అత్యంత సరసమైన ప్రొడక్టులను అందించడంలో దాని ఖ్యాతిని పెంచుకుంది. అయితే గ్రోవర్ ఇది ప్రైస్ పాయింట్ గురించి మాత్రమే కాదని నొక్కి చెప్పారు. వినియోగదారులకు రిమార్కబుల్ ఎక్స్‌పీరియన్స్ అందించడం లక్ష్యమని పేర్కొన్నారు. కస్టమర్ నుంచి వసూలు చేసే ప్రతి రూపాయికి బెటర్ వ్యాల్యూ అందించడం, మార్కెట్‌లో అందరికీ సమాన సేవలు అందించడం, పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకర్షించడం చుట్టూ తమ ప్రయత్నాలు ఉంటాయని మెహతా తెలిపారు.
భవిష్యత్తు ప్రణాళికలు
బోట్ దాని ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను ఎక్స్‌ప్యాండ్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సమీప కాలంలో వేరియబుల్స్‌పై దృష్టి సారిస్తుంది. మెహతా భారతదేశంలో బిలియన్-డాలర్ వ్యాపారాన్ని సాధించాలనే వారి ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని వెల్లడించారు. ఇన్నోవేటివ్ వేరియబుల్స్ డెవలప్ చేయడంపై ఇంజినీరింగ్ ట్యాలెంట్ కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నారు. రాబోయే వివిధ డాల్బీ-బేస్డ్ ప్రొడక్టులపై కూడా దృష్టి సారించారు. ఈ ప్రొడక్టులను నిర్ణీత సమయంలో ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇండియన్ బ్రాండ్స్‌తో డాల్బీ ఫ్యూచర్ కొలాబరేషన్
డాల్బీ ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని విస్తరిస్తోంది, గ్రోవర్ మరిన్ని ఇండియన్ బ్రాండ్‌లతో కొలాబరేట్ కావడంపై ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. సినిమాహాళ్లు, టెలివిజన్‌లు, ఇప్పుడు కార్లతో సహా వివిధ పరిశ్రమలకు డాల్బీ ఆడియో, విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను తీసుకురావడంపై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. ఇండియన్ కంపెనీలు వెనుకబడి లేవని, ఆటోమోటివ్ రంగంలో అట్మాస్, విజన్ డెవలప్‌మెంట్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పారు.
స్టార్టప్ ఫౌండర్స్‌కి సలహా
కస్టమర్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి పెట్టాలని యంగ్ స్టార్టప్ ఫౌండర్స్‌కు మెహతా సూచించారు. కస్టమర్ ఫీడ్‌బ్యాక్, రేటింగ్‌లు, సమీక్షలను నిశితంగా పర్యవేక్షించడం, మార్కెట్‌లో గెలవడానికి ఎల్లప్పుడూ వ్యాల్యూ డెలివర్ చేయాలని పేర్కొన్నారు. ఫౌండర్స్ కస్టమర్-ఫస్ట్‌గా ఉండాలని, గ్లోబల్ దిగ్గజాలుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నప్పటికీ, కస్టమర్ సంతృప్తి విజయానికి కీలకమని అర్థం చేసుకోవాలని కోరారు.
COMMENTS