Sharechat CEO Ankush Sachdeva: Failed 17 times.. Now Rs. 40 thousand crore empire - this is success!
Sharechat CEO Ankush Sachdeva: 17 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ. 40వేల కోట్ల సామ్రాజ్యం - ఇది కదా సక్సెస్ అంటే!
అంకుష్ సచ్‌దేవా పేరు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ 'షేర్‌చాట్' పేరు మాత్రం అందరికి తెలుసు. ఈ షేర్‌చాట్ వ్యవస్థాపకుడే అంకుష్ సచ్‌దేవా.
విజయం సాధించడంలో 17 సార్లు విఫలైమనప్పటికీ ప్రస్తుతం రూ. 40,000 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది? దీని వెనుక అతని కృషి ఎలా ఉందనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
షేర్‌చాట్‌తో ఇంతలా పాపులర్ అవ్వడానికి అతడు అహర్నిశలు కష్టపడ్డాడు. ఈ రోజు షేర్‌చాట్ మారు మూల గ్రామాలకు కూడా పాకింది. ఈ ప్రయాణంలో అతడు 17 సార్లు ఫెయిలయ్యాడు. మొత్తానికి పట్టువదలని విక్రమార్కునిలాగా అనుకున్నది సాధించి సక్సెస్ సాధించాడు.
2015లో ప్రారంభమైన షేర్‌చాట్ ప్రస్తుతం తెలుగు, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళం, బెంగాలీ, ఒడియా, కన్నడ, అస్సామీ, హర్యాన్వి, రాజస్థానీ, భోజ్‌పురి, ఇంగ్లీష్ సహా మొత్తం 15 భాషలలో అందుబాటులో ఉంది. అంకుష్ సచ్‌దేవా మొదట్లో 17 స్టార్టప్‌లను ప్రారంభించినప్పటికీ అవన్నీ విఫలమయ్యాయి. ఆ తరువాత 18వ ప్రయత్నంలో అంకుష్ సచ్‌దేవా అతని ఇద్దరు ఐఐటీ ఫ్రెండ్స్ ఫరీద్ అహ్సన్, భాను సింగ్‌తో కలిసి షేర్‌చాట్ ప్రారంభించాడు.
1992 ఘజియాబాద్‌లో జన్మించిన అంకుష్ సచ్‌దేవా తన సీనియర్ సెకండరీ పాఠశాల విద్యను సోమర్‌విల్లే స్కూల్‌లో పూర్తి చేసి, తరువాత 2011లో ఐఐటి కాన్పూర్‌లో కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పూర్తి చేసాడు. ఆ తరువాత 2015లో మైక్రోసాఫ్ట్‌లో కొంత శిక్షణ పొందాడు.
భారతదేశంలో షేర్‌చాట్ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. దీనికి అంకుష్ సచ్‌దేవా సీఈఓగా ఉన్నారు. ఇది ప్రస్తుతం 15 భారతీయ భాషల్లో 350 మిలియన్ల కంటే ఎక్కువ మంది మంత్లీ యాక్టివ్ యూజర్స్ కలిగి ఉంది. ఇందులో సుమారు 2,500 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం షేర్‌చాట్ విలువ దాదాపు 5 బిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 40,000 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికల ద్వారా తెలుస్తోంది.
COMMENTS