Scholarships: Alert for students.. Huge stipend with these scholarships.. Apply quickly..
Scholarships: స్టూడెంట్స్‌కు అలర్ట్.. ఈ స్కాలర్‌షిప్స్‌తో భారీ స్టైపండ్.. త్వరగా అప్లై చేసుకోండి..
ఎడ్యుకేషన్ రంగంలో స్కాలర్‌షిప్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఉన్నత విద్య, వృత్తిపరమైన లక్ష్యాలను సాకారం చేసుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ప్రక్రియలో ఆర్థికంగా ఎదురయ్యే అవాంతరాలను సైతం అధిగమిస్తాయి. అనేక సంస్థలు డిగ్రీ నుంచి పీహెచ్‌డీ చేస్తున్న వారికి వివిధ రకాల ఫెలోషిప్స్, స్కాలర్‌షిప్స్ అందిస్తున్నాయి. ఈ క్రమంలో, ప్రస్తుతం అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్స్, ఇంటర్న్‌షిప్ వివరాలను పరిశీలిద్దాం.
ONGC ఫౌండేషన్ స్కాలర్‌షిప్, 2023-24
ఈ స్కాలర్‌షిప్‌ను ఓఎన్‌జీసీ ఫౌండేషన్ ఆఫర్ చేస్తోంది. 2023- 24 అకడమిక్ ఇయర్ ఇంజనీరింగ్, MBBS, MBA స్టూడెంట్స్‌తో పాటు జియాలజీ, జియోఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీలో చేరిన విద్యార్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు.
ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ అభ్యర్థులు 12వ తరగతిలో కనీసం 60% మార్కులు సాధించాలి. ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌లో పీజీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌లో 60% మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2,00,000 కంటే తక్కువగా ఉండాలి. అర్హులైన అభ్యర్థులు www.b4s.in/it/ONGC8 లింక్ ద్వారా జులై 8 లోపు అప్లై చేసుకోవాలి. ఎంపికయ్యే అభ్యర్థులకు సంవత్సరానికి రూ.48,000 స్కాలర్‌షిప్ అందుతుంది.
కోటక్ జూనియర్ స్కాలర్‌షిప్- 2023
కోటక్ మహీంద్రా గ్రూప్ కంపెనీలకు చెందిన కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ స్కాలర్‌షిప్ ఆఫర్ చేస్తోంది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలోని జూనియర్ కాలేజీల్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవాలి.
అభ్యర్థులు 2023 పదో తరగతి పరీక్షలో (SSC/CBSE/ICSE) 85% పైగా మార్కులు సాధించి ఉండాలి. వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,20,000 లోపు ఉండాలి. 2023-24 అకడమిక్ ఇయర్ కోసం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని ఆర్ట్స్, కామర్స్, సైన్స్ స్ట్రీమ్‌ల్లో ముంబైలోని జూనియర్ కాలేజీల్లో 11వ తరగతిలో అడ్మిషన్ పొంది ఉండాలి. అన్ని అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్‌లో www.b4s.in/it/KJSP1 లింక్ ద్వారా జూన్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికయ్యే విద్యార్థులకు నెలకు రూ.3000 స్కాలర్‌షిప్ అందుతుంది.
లా స్టూడెంట్స్ వాలంటరీ ఇంటర్న్‌షిప్ స్కీమ్- 2023
లెజిస్లేటివ్ డ్రాఫ్టింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ILDR), లా స్టూడెంట్స్ కోసం వాలంటరీ ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తోంది. గుర్తింపు పొందిన లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీలో నాలుగు లేదా ఐదో సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు లేదా న్యాయశాస్త్రంలో మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీలో చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు ఈ ఇంటర్న్‌షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్‌ను ఈ సంవత్సరంలో ఎప్పుడైనా పంపవచ్చు. మెయిల్ లేదా పోస్ట్ ద్వారా బ్రాంచ్ ఆఫీసర్, ILDR, 416 ‘D’ వింగ్, లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, శాస్త్రి భవన్, న్యూఢిల్లీ-110 001అనే అడ్రస్‌కు పంపాలి. ఎంపికయ్యే అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత ILDR సర్టిఫికేట్ అందిస్తారు. మరిన్ని వివరాలకు https://legislative.gov.in/ లింక్ చెక్ చేయవచ్చు.
COMMENTS