scholarship and fellowships: A financial egg for a brighter future.. Don't miss these scholarships..
scholarship and fellowships: సమున్నత భవితకు ఆర్థిక అండ.. ఈ స్కాలర్‌షిప్‌లను మిస్ చేసుకోవద్దు..
ఉన్నత విద్య అనేది ప్రతి విద్యార్థి కల. కానీ అందరూ దానిని అందుకోలేరు. దానికి రకరకాల కారణాలుంటాయి. వాటిల్లో ప్రధానమైనది ఆర్థిక లేమి. సరైన ఆర్థిక వెసులుబాటు లేని కారణంగా చదువులను మధ్యలోనే ఆపేసేవారు చాలా మంది ఉంటారు. అలాంటి వారికి పలు స్కాలర్ షిప్ లు ఉపకరిస్తాయి. అలాగే పరిశోధనలు చేయాలనుకొనేవారికి ఫెలోషిప్ లు సాయపడతాయి. మిమ్మల్ని సమున్నతంగా నిలబెట్టడానికి ఇవి ఆర్థిక అండను కల్పిస్తాయి. ఈ నేపథ్యంలో జూన్ నుంచి ఆగస్టులోపు దరఖాస్తు చేసుకోవాల్సిన మూడు స్కాలర్షిప్, ఫెలోషిప్ ప్రోగ్రామ్ లు, అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల నుంచి పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్‌లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందిస్తున్నాం. అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, స్కాలర్ షిప్ ఎంత ఇస్తారు? వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..
జ్ఞాన్‌దన్ స్కాలర్‌షిప్ 2023(GYANDHAN SCHOLARSHIP 2023)..
పోస్ట్‌గ్రాడ్యుయేట్-స్థాయి విద్యార్థులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి జ్ఞాన్‌ధన్ ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్న విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ పథకం లక్ష్యం.
అర్హత:
గుర్తింపు పొందిన భారతీయ సంస్థల నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్న భారతీయ పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, జర్మనీలలో రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును అభ్యసించడానికి సిద్ధంగా ఉండాలి. ఒకేసారి రూ. లక్ష వరకూ ఆర్థిక సాయం అందిస్తారు. ఆన్ లైన్ లోమాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 2023, ఆగస్టు 31 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి..
ఈఎస్ఆర్ఐ ఇండియా ఎం.టెక్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023(ESRI INDIA MTECH SCHOLARSHIP PROGRAMME 2023)..
ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023 అనేది జియోఇన్ఫర్మేటిక్స్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసింది. అలాగే రిమోట్ సెన్సింగ్, జీఐఎస్, స్పేషియల్ మోడలింగ్, స్పేషియల్ అనాలిసిస్, జీఐఎస్, సంబంధిత సబ్జెక్టుల కోసం డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ వంటి కోర్సులను తీసుకున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత:
18 సంవత్సరాల వయస్సు దాటిన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తుదారులు తప్పనిసరిగా జియోఇన్ఫర్మేటిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు [MTech/MSc.] 2వ సంవత్సరం ప్రారంభంలో ఉండాలి. లేదా GIS సంబంధిత సబ్జెక్టుల కోసం రిమోట్ సెన్సింగ్/జీఐఎస్/స్పేషియల్ మోడలింగ్/స్పేషియల్ అనాలిసిస్/డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్‌తో కూడిన కోర్సు కలిగి ఉండాలి. ఏడాదికి ఒక విద్యార్థికి రూ. లక్ష వరకూ ఆర్థిక సాయం అందిస్తారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2023 జూలై 10. దరఖాస్తులు కేవలం ఈమెయిల్(gis.education@esri.in) ద్వారా మాత్రమే పంపాలి. మరిన్ని వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
మేధావి ఇంజినీరింగ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023-24..
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) భారతదేశంలోని నిర్దేశిత 20 ఎన్ఐలలో ఇంజినీరింగ్ కోర్సులను అభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. వారి ఉన్నత చదువులు, ఆత్మవిశ్వాసం పొందడం, స్వాతంత్ర్యం సాధించడం, ఉపాధి పొందేలా వారిని ప్రోత్సహిస్తోంది.
అర్హత:
భారతదేశం అంతటా పేర్కొన్న 20 ఎన్ఐటీలలో దేనిలోనైనా 2023-24 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సులలో (ఏ సంవత్సరం అయినా) నమోదు చేసుకున్న విద్యార్థులు అర్హులు. దరఖాస్తుదారులు 12వ తరగతి పరీక్షలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం అన్ని మూలాల నుండి రూ. 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి. ఏడాదికి రూ. 50,000 వన్ టైమ్ ఫిక్స్ డ్ స్కాలర్ షిప్ వస్తుంది. ఆన్ లైన్లో 2023 జూన్ ఏడో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
COMMENTS