SBI WhatsApp Banking: Good news for SBI users.. All services on WhatsApp..
SBI WhatsApp Banking: ఎస్బీఐ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే అన్ని సేవలు.. బ్రాంచ్ వరకూ వెళ్లాల్సిన పనే లేదు..
రోజురోజుకీ బ్యాంకింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. డిజిటల్ ఫీచర్లతో వినియోగదారులకు సరికొత్త సర్వీసులను అందిస్తోంది. అందులో ఒకటి వాట్సాప్ సర్వీస్. ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ జనాలకు బాగా కనెక్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ వాట్సాప్ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకులు కూడా వాట్సాప్ ద్వారా సేవలను ప్రారంభిస్తున్నాయి. వాటిల్లో ముందజలో ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అనువైన మార్గంలో వినియోగదారులకు అద్భుతమైన సేవలను అందిస్తోంది. బ్యాలెన్స్ చెక్ చేయడం, మినీ స్టేట్ మెంట్ పొందడం వంటివి వాట్సాప్ ద్వారా పొందవచ్చు. అందుకోసం వినియోగదారులు ఏం చేయాలి? వాట్సాప్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఎలా? చూద్దాం..
ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్..
ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ లో ఉన్న సమాచారం ప్రకారం ఈ వాట్సాప్ ద్వారా ఈ కింది సేవలను పొందవచ్చు. ఆ వివరాలు ఇవి..
- బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. సోల్ ప్రొప్రైటర్స్ సీసీ ఓడీ అకౌంట్ హోల్డర్లు కూడా బుక్ బ్యాలెన్స్, అకౌంట్ రెన్యూవల్ డేట్, స్టాక్ స్టేట్మెంట్ ఎక్స్ పైరీ డేట్ వంటివి తెలుసుకోవచ్చు.
- మినీ స్టేట్ మెంట్
- పెన్షన్ స్లిప్ సర్వీస్
- లోన్ ఉత్పత్తులపై సమాచారం (గృహ రుణం, కార్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్) – తరచుగా అడిగే ప్రశ్నలు, వడ్డీ రేట్లు
- డిపాజిట్ ఉత్పత్తులపై సమాచారం (సేవింగ్స్ ఖాతా, రికరింగ్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్ – ఫీచర్లు, వడ్డీ రేట్లు
- ఎన్ఆర్ఐ సేవలు (ఎన్ఆర్ఈ ఖాతా, ఎన్ఆర్ఓ ఖాతా) – ఫీచర్లు, వడ్డీ రేట్లు ఇన్‌స్టా ఖాతాలు తెరవడం (ఫీచర్‌లు/అర్హత, అవసరాలు, తరచుగా అడిగే ప్రశ్నలు) కాంటాక్ట్స్/గ్రీవెన్స్ రిడ్రెస్సల్ హెల్ప్‌లైన్‌లు
- ప్రీ అప్రూవ్ డ్ లోన్ ప్రశ్నలు (వ్యక్తిగత లోన్, కార్ లోన్, టూ వీలర్ లోన్)
- డిజిటల్ బ్యాంకింగ్ సమాచారం
- బ్యాంకింగ్ ఫారమ్‌లను డౌన్‌లోడ్ చేయండి
- హాలిడే క్యాలెండర్
- డెబిట్ కార్డ్ వినియోగంపై సమాచారం
- లాస్ట్/స్టోలెన్ కార్డ్ గురించిన సమాచారం
- సమీప ఏటీఎం/బ్రాంచ్ లొకేటర్
రిజిస్ట్రేషన్ ఇలా..
ఎస్బీఐ ఖాతాతో రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్ నుంచి “WAREG ACCOUNT NUMBER” అని టైప్ చేసి +917208933148కు ఎస్ఎంఎస్ పంపాలి. ఉదాహరణకు మీ అకౌంట్ నంబర్ 12345678 అయితే మీరు WAREG 12345678 అని టైప్ చేసి +917208933148కు సెండ్ చేస్తే సరిపోతుంది.
రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత మీ వాట్సాప్ లింకైన నంబర్కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
ఆ తర్వాత మీ వాట్సాప్ నంబర్ నుంచి వాట్సాప్ లో “Hi” అని +919022690226 నంబర్కు మెసేజ్ పెట్టాలి. ఆ తర్వాత చాట్ బోట్ ఇచ్చే సూచనలను ఫాలో అవ్వాలి.
ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ కు ఎవరు అర్హులు..
ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను సేవింగ్స్ ఖాతా దారులు, కరెంట్ అకౌంట్, ఎన్ఆర్ఐ అకౌంట్స్, సీసీ ఓడీ అకౌంట్స్ ప్రొప్రైటర్స్ మాత్రమే పొందగలరు.
COMMENTS