Rs 2000 Notes: Rs. 2000 notes will come and take them home.. No need to go to the bank anymore..
Rs 2000 Notes: రూ. 2000 నోట్లను ఇంటికే వచ్చి తీసుకెళ్తారు.. ఇక బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు..
రూ. 2000 నోటు మార్చుకోవాలనుకొనే వారికి గుడ్ న్యూస్. ఇకపై బ్యాంకులకు వెళ్లి క్యూ నిలబడి కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఓ ప్రత్యేక మార్గాన్ని కొనుగొంది. వినియోగదారుల సౌకర్యార్థం అమెజాన్ పే క్యాష్ లో నెలకు రూ. 50,000 వరకూ రూ. 2,000 డిపాజిట్ చేసుకొనే అవకాశం కల్పించింది. అది కూడా ఇంటికే వచ్చి మీ వద్ద ఉన్న రూ. 2,000 నోట్లను తీసుకెళ్లేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అమెజాన్ పే అకౌంట్ లోకి మీ నగదును లోడ్ చేసుకొని, దానినుపయోగించి ఆన్ లైన్ లో కావాల్సిన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్ అకౌంట్లకు ఆ డబ్బుల్ని ట్రాన్స్ ఫర్ చేయొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రూ. 2,000 నోట్లను ఎలా డిపాజిట్ చేయాలి..
అమెజాన్ పేలో క్యాష్ ఎలా డిపాజిట్ చేయాలంటే .. మనం అమెజాన్ లో ఏదైనా వస్తువు ఆర్డర్ పెట్టుకున్న వస్తువు డెలివరీ అయ్యే సమయంలో నగదు చెల్లిస్తుంటాం కదా.. అదే సమయంలో డెలివరీ అసోసియేట్ కు మన వద్ద ఉన్న రూ. 2000 నోట్లను వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం అసోసియేట్లు మనం ఎంత విలువైన రూ.. 2,000 నోట్లను ఇచ్చామో.. ఆ మొత్తాన్ని మన అమెజాన్ పే అకౌంట్కు ట్రాన్స్ ఫర్ చేస్తారు.
సెప్టెంబర్ 30 వరకూ అవకాశం..
మరోవైపు రూ.2000 డినామినేషన్ కరెన్సీ నోట్లను క్రమంగా చలామణి నుంచి తొలగిస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రకటించింది. రూ. 2000 నోట్లను కలిగి ఉన్న వ్యక్తులు వాటిని మార్చుకోవచ్చు లేదా మే 23, 2023 నుండి ఏదైనా బ్యాంక్‌లో డిపాజిట్ చేయవచ్చు. ఈ సదుపాయం సెప్టెంబర్ 30, 2023 వరకు తెరిచి ఉంటుంది. అయితే సెప్టెంబర్ 30 తర్వాత కూడా కరెన్సీ నోట్లు లీగల్ టెండర్ హోదాను కలిగి ఉంటాయని గమనించాలి.
COMMENTS