RRB NTPC Results: Railway RRB NTPC Results Released.. Check..
RRB NTPC Results: రైల్వే RRB NTPC ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) NTPC (CEN 1/2019) ఫలితాలను ప్రకటించడం ప్రారంభించింది. అభ్యర్థులు తమ సంబంధిత RRBల అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించి ఎంపిక ప్రక్రియను తనిఖీ చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థుల రోల్ నంబర్లు మరియు పేర్లు ఫలితాల ప్రకటనలో జారీ చేయబడ్డాయి. ఫలితాలను అభ్యర్థులు డైరెక్ట్ గా ఈ లింక్ ను ఉపయోగించి తెలుసుకోవచ్చు.
CBT (1 & 2), CBAT మరియు CBTSTలలో వారి పనితీరు ఆధారంగా వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పోస్ట్‌లకు తాత్కాలికంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల జాబితాను RRB విడుదల చేసింది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఫలితాలను RRBల అధికారిక వెబ్‌సైట్‌లలో తనిఖీ చేయవచ్చు.
RRB NTPC స్థాయి-6,5,3,2 ఫలితాలు చెక్ చేయండిలా..
- -రైల్వే బోర్డు అధికారిక వెబ్‌సైట్ rrbcdg.gov.in సందర్శించండి .
- -ఆపై హోమ్‌పేజీలో.. RRB (NTPC) లెవెల్ 6,5,3,2 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
- అప్పుడు ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది.
- -తర్వాత ఇక్కడ ఫలితాన్ని తనిఖీ చేయండి. PDFని డౌన్‌లోడ్ చేయండి. దీనిని భవిష్యత్తు సూచన కోసం ప్రింటవుట్ తీసుకోండి.
దక్షిణ మధ్య రైల్వేలో టెక్నీషియన్ అసోసియేట్..
దక్షిణ మధ్య రైల్వే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. దీని ప్రకారం రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. SCR అధికారిక సైట్ scr.indianrailways.gov.inను సందర్శించడం ద్వారా అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30 జూన్ 2023.
దక్షిణ మధ్య రైల్వేలో 35 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తుంది. వీటిలో సివిల్ ఇంజినీరింగ్ 19, ఎలక్ట్రికల్ (డ్రాయింగ్) 10, ఎస్ అండ్ టీ (డ్రాయింగ్) 6 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇది కాకుండా.. అభ్యర్థులు మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
COMMENTS