RGUKT Basara six-year integrated course admissions for the academic year 2023-24.
ఆర్జీయూకేటీ బాసర లో 2023-24 విద్యాసంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశాల పూర్తి వివరాలు ఇవే
ఆర్జీయూకేటీ-బాసర లో 1650 ఇంటిగ్రేటెడ్ బీటెక్ (ఇంటర్+బీటెక్) సీట్ల భర్తీకి జూన్ 1న నోటిఫికేషన్ జారీ అవ్వనుంది. జూన్ 5 నుంచి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. వర్సిటీ ఉపకులపతి వి. వెంకటరమణ బుధవారం ప్రవేశాల ప్రక్రియ కాలపట్టికను హైదరాబాద్ లో విడుదల చేశారు.
వర్సిటీలో 1500 సీట్లు ఉండగా.. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 150 అదనంగా భర్తీ చేస్తామన్నారు. ప్రవేశాల ప్రక్రియ విధానంలో కొన్ని మార్పులు చేయటంతో నోటిఫికేషన్ జారీ ఆలస్యమైందని చెప్పారు.
* మొత్తం సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడతారు.
* ఈ సంవత్సరం పదో తరగతి పాసైన వారు మాత్రమే ప్రవేశాలకు అర్హులు. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వయసు 21 సంవత్సరాలు, మిగిలిన వారి వయసు 18 ఏళ్ల లోపు ఉండాలి.
* దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.450, ఇతరులకు రూ.500
* ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి పదో తరగతి గ్రేడ్ కు 0.40 స్కోర్ కలుపుతారు.
* ఒకవేళ ఇద్దరు విద్యార్థుల స్కోర్ సమానంగా ఉంటే క్రింద పేర్కొన్న ఏడు కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటారు.
1.గణితం, 2.సైన్స్, 3.ఆంగ్లం, 4.సాంఘికశాస్త్రం, 5.ప్రథమ భాషలో గ్రేడ్, 6.పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు, 7.హాల్ టికెట్ ర్యాండమ్ నంబరు.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ: 01/06/2023
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 05/06/2023
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ: 19/06/2023
ప్రత్యేక కేటగిరీ (పీహెచ్/క్యాప్/ఎన్సీసీ/క్రీడాకారులు) వారు ఆన్లైన్ దరఖాస్తు ప్రింటౌట్ ను సమర్పించేందుకు తుది గడువు: 24/06/2023
ఎంపికైన విద్యార్థుల జాబితా వెల్లడి: 26/06/2023
తొలి విడత కౌన్సెలింగ్ (ధ్రువపత్రాల పరిశీలన): 01/07/2023
Important Links:
COMMENTS