RBI Recruitment 2023: Notification for various posts in RBI
RBI Recruitment 2023: ఆర్బీఐలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత.. వివరాలివే
ప్రభుత్వ ఉద్యోగం అంటే ఉన్నత చదువులు పూర్తి చేసిన ప్రతి విద్యార్థి కల. అర్హతకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు చేసినా ప్రభుత్వ ఉద్యోగం పొందాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. కొంతమందైతే కేవలం ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికే ఏళ్ల తరబడి ప్రిపేర్ అయ్యేవారు ఉంటారు. ఎప్పుడెప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతాయో? ఆత్రుతతో ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ ఉద్యోగాల కోసం పోటీ కూడా అధికంగా ఉంటుంది.
తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మేనేజర్ సహా ఇతర పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత ఉన్న అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు .
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూన్ 20, 2023గా ఉంది. అలాగే అర్హత పరీక్ష జూలై 23, 2023న నిర్వహించనున్నారు. ఆయా పోస్టులను అర్హతను కూడా నిర్ణయించారు.
ఖాళీల వివరాలు
గ్రేడ్ బీలో లీగల్ ఆఫీసర్: 1 పోస్ట్
లైబ్రరీ మేనేజర్ (టెక్నికల్- సివిల్): 3 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (రాజ్‌భాష): 1 పోస్ట్
గ్రేడ్ ఏలో ప్రొఫెషనల్ (అసిస్టెంట్ లైబ్రేరియన్): 1 పోస్ట్
పే స్కేల్
గ్రేడ్ ఏ ఆఫీసర్ల పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు రూ.₹44500-85850 ప్రారంభ వేతనంగా ఉంటుంది. గ్రేడ్ బీ ఆఫీసర్లగా ఎంపికైతే రూ.55,200 ప్రారంభ వేతనంగా ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు ఇవే
దరఖాస్తుల నమోదు, ఫీజు/ఇంటిమేషన్ ఛార్జీల చెల్లింపు కోసం వెబ్సైట్ లింక్‌ను మే 29 తెరిచారు. జూన్ 20, 2023 వరకు సాయంత్రం 6.00 గంటల వరకు పరీక్షకు నమోదు చేసుకునే అవకాశం ఉంది.
ఎంపిక విధానం
ఎంపిక ఆన్లైన్ పరీక్ష పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, ఆఫ్‌లైన్ ఎగ్జామ్ పేపర్ 2 డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. గ్రేడ్ ఏలో అసిస్టెంట్ లైబ్రేరియన్ మినహా మిగిలిన పోస్టులకు జూలై 23, 2023న పరీక్ష ఉంటుంది.
దరఖాస్తు రుసుము
జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభర్థులు రూ.600 + 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 100 + 18 శాతం జీఎస్టీ చెల్లించాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
COMMENTS