NIT: Hamirpur NIT Non-Teaching Posts, details are as follows
NIT: హమిర్‌పూర్ నిట్‌లో నాన్‌టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
హమిర్‌పూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) వివిధ నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 84 పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టును అనుసరించి సీనియర్ సెకండరీ(10+2), ఐటీఐ, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంసీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ జూన్ 16న ప్రారంభమైంది. జులై 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు
మొత్తం ఖాళీలు: 84
పోస్టుల వారీగా ఖాళీలు..
➥ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్/సీనియర్ టెక్నికల్ ఆఫీసర్: 02
➥ సైంటిఫిక్ ఆఫీసర్/టెక్నికల్ ఆఫీసర్: 02
➥ సూపరింటెండెంట్: 05
➥ పర్సనల్ అసిస్టెంట్: 01
➥ జూనియర్ అసిస్టెంట్:12
➥ సీనియర్ అసిస్టెంట్: 04
➥ టెక్నికల్ అసిస్టెంట్: 18
➥ జూనియర్ ఇంజినీర్: 02
➥ స్టూడెంట్స్ ఆక్టివిటీ & స్పోర్ట్స్ (సాస్) అసిస్టెంట్: 02
➥ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 02
➥ టెక్నీషియన్: 02
➥ సీనియర్ టెక్నీషియన్: 11
➥ ఫార్మసిస్ట్: 01
అర్హత: పోస్టును అనుసరించి సీనియర్ సెకండరీ(10+2), ఐటీఐ, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంసీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: పోస్టుని అనుసరించి 27-50 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్/ ట్రేడ్ టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.21700-రూ.209200 చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.06.2023.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 10.07.2023.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR APPLY ONLINE CLICKHERE
COMMENTS