NHPC Limited Jobs 2023: 10th Class/Diploma Eligibility.. 388 Jobs in Niveli Lignite Corporation
NHPC Limited Jobs 2023: పదో తరగతి/డిప్లొమా అర్హత.. నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌లో 388 ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.1,19,500 జీతం
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌పీసీ).. 388 జూనియర్ ఇంజినీర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. రి
జర్వేషన్ వర్గాలకు చెందిన వారు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందితే సరిపోతుంది. సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి.
దరఖాస్తుదారుల వయసు జూన్ 30, 2023వ తేదీనాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో జూన్ 30, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ (ఎన్‌సీఎల్) కేటగిరీలకు చెందిన వారు రూ.295లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. హిందీ/ఇంగ్లిష్ భాషలో రాత పరీక్ష ఉంటుంది. మొత్తం 200 మార్కులకు 3 గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది.
ఎంపికైన వారికి నెలకు జూనియర్ ఇంజినీర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు రూ.29,600 నుంచి రూ.1,19,500, హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు రూ.27,000 నుంచి రూ.1,05,000, డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులకు రూ.25,000 నుంచి రూ.85,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
జూనియర్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు: 149
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు: 74
జూనియర్ ఇంజినీర్ (మెకానికల్) పోస్టులు: 63
జూనియర్ ఇంజినీర్ (ఇ&సి) పోస్టులు: 10
సూపర్‌వైజర్ (ఐటీ) పోస్టులు: 9
సూపర్‌వైజర్ (సర్వే) పోస్టులు: 19
సీనియర్ అకౌంటెంట్ పోస్టులు: 28
హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు: 14
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్) పోస్టులు: 14
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (ఎలక్ట్రికల్/ మెకానికల్) పోస్టులు: 8
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
COMMENTS