Manuu recruitment: Hyderabad Manuu teaching posts.
Manuu recruitment: హైదరాబాద్ మనూలో టీచింగ్ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఈ విద్యా సంస్థలో ఉన్న పలు టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 47 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 47 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్-కమ్-డైరెక్టర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ – కమ్ – డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ – కమ్ – అసిస్టెంట్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్, లెక్చరర్ ఖాళీలు ఉన్నాయి.
* ఎడ్యుకేషన్, అరబిక్, హిందీ, ఉమెన్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, జువాలజీ, బోటనీ, ఫిజిక్స్, సోషల్ వర్క్, సోషియాలజీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీని నేరుగా వర్సిటీలో అందించాల్సి ఉంటుంది.
* ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అసవరం లేదు. ఇతరులు రూ. 500 ఫీజు చెల్లించాలి.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 21-06-2023తో ముగియనుండగా, దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు 27-06-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
COMMENTS