Kairan Quazi: An extraordinary talent at the age of 14.. A job as a software engineer caught Ellen's eye.
Kairan Quazi: 14 ఏళ్లకే అసాధారణ ప్రతిభ.. ఎలెన్ దృష్టిలో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం..
వయసుకు ప్రతిభకు సంబంధం లేదు.. ఇదే విషయాన్నీ మరోసారి రుజువు చేశాడు 14 ఏళ్ల బాలుడు. తన అసాధారణ ప్రతిభతో తోటి విద్యాదుల కంటే వేగంగా నేర్చుకుని అందరినీ ఆశ్చర్యాన్ని ముంచెత్తాడు. ఇప్పుడు ఏకంగా ఎలాన్ మస్క్ తన కంపెనీలో ఏరికోరి మరీ ఉద్యోగం ఇచ్చాడు. మరి చిన్న వయసులో ఉద్యోగం సంపాదించి అందరికీ షాక్ ఇచ్చిన ఆ టీన్ కుర్రాడి ప్రతిభ .. ఆ బాలుడు ఎందుకు అంత వెరీ వెరీ స్పెషల్ తెలుసుకుందాం..
కాలిఫోర్నియాకి చెందిన కరెన్ కాజీ మూడవ తరగతి చదువుతున్నప్పుడే చాలా వేగంగా నేర్చుకునేవాడు. కారెన్ ఈజీగా ఏ విషయాన్నీ అయినా నేర్చుకోవడం క్లాస్ టీచర్స్ సహా అందరూ గమనించారు. తర్వాత ఆ పిల్లాడిని చైల్డ్ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి పరీక్షించమని కోరారు. అప్పుడు డాక్టర్స్.. కారెన్ ఐక్యూ లెవెల్స్ టెస్ట్ చేసి షాక్ తిన్నారు. అంతేకాదు ఇదే విషయాన్నీ కారెన్ పేరెంట్స్ కు చెప్పారు.
అంతేకాదు దీంతో ఆ పిల్లాడిని పై తరగతులకు రిఫర్ చేశారు. అంతేకాదు కారెన్ కు సూపర్ ఐక్యూ తో పాటు.. వయసుకు మించి మానసిక పరిణితి కూడా ఉందని.. ఇది తన వయసు పిల్లలకంటే ఎక్కువ అని చెప్పారు. దీంతో చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభతో పై చదువులకు వైద్యులు రిఫర్ చేశారు. 9 సంవత్సరాల వయసులో లాస్ పోసిటాస్ కమ్యూనిటీ కాలేజీకి వెళ్ళాడు. అక్కడ రెండేళ్ళు చదివిన తరువాత 11ఏళ్ళ వయసులో శాంటా క్లారా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. మరొక వారంలో ఈ పిల్లాడి గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకోనున్నాడు.
అయితే గ్రాడ్యుయేషన్ చదువునే కారెన్ ఇంటెల్ ల్యాబ్స్ లో ఇంటర్న్ గా పనిచేశాడు. తన ప్రతిభతో కారెన్ ఏకంగా ఎలాన్ మస్క్ దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు ఏకంగా 14 ఏళ్లకే స్పేస్ ఎక్స్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా ఎంపికయ్యాడు. జూన్ నెలలోనే ఉద్యోగంలో చేరబోతున్నాడు.
బాలుడి విషయం గురించి తెలిసి ప్రపంచమే విస్తుపోతోంది. అంతేకాదు కరెన్ ప్రతిభగురించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు బాల్యాన్ని కోల్పోతున్నాడని కొందరు అంటే.. మరికొందరు.. అతని ప్రతిభకు సలామ్ అంటున్నారు. చదువుకోవడం, చిన్న వయసులోనే అవకాశాలను అందుకోవడం గొప్పని అని.. తమకు సంతోషంగా ఉంది ఈ బాలుడిని చూస్తే అని అంటున్నారు.
అయితే ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థలో సాప్ట్వేర్ ఇంజనీర్ గా చేరాబోతున్న నేపథ్యంలో కరెన్ తన తల్లిలో కలసి కాలిఫోర్నియా నుండి వాషింగ్టన్ కు మారనున్నాడు. ఈ పనుల్లో బిజీబిజీగా ఉన్నాడు.
COMMENTS