Knowledge: Do you know why the train goes faster at night than during the day..? This is the reason..
Knowledge: రైలు పగటిపూట కంటే రాత్రిపూట ఎందుకు వేగంగా వెళ్తుందో తెలుసా..? కారణం ఇదే..
భారతీయ రైల్వే..అంటే.. అక్షరాలా మన దేశానికి వెన్నెముకవంటిది. భారతీయ రైల్వేను రవాణా సాధనంగా ఉపయోగించి ప్రతిరోజూ లక్షల మంది ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా రైలు ప్రయాణం సాగుతోంది. రోజూ లక్షలాది మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తుంటారు. ఈ ప్రయాణం తక్కువ ఖర్చుతో అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ, రైళ్లు పగటిపూట కంటే రాత్రి వేళల్లో ఎక్కువ స్పీడ్‌తో నడుస్తున్నాయి. దీనికి కారణం ఏంటన్నది ఎప్పుడైనా ఆలోచించారా? రాత్రిపూట రైలు వేగం ఎందుకు పెరుగుతుంది..? అందుకు కారణాలేమిటనేది ఇక్కడ తెలుసుకుందాం..
పగటిపూట స్టేషన్లన్నీ జనంతో కిక్కిరిసిపోతుంటాయి. ప్రజలు పట్టాలు దాటుకుంటూ అవతలి వైపు వెళ్తుంటారు. సబ్‌వేని ఉపయోగించకుండా ప్లాట్‌ఫారమ్‌లను మారడానికి ప్రజలు రైలు పట్టాలను దాటుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. అంతే కాదు పగటిపూట జంతువులు కూడా రైలు పట్టాలను దాటుతుంటాయి. కాబట్టి రైలు వేగంగా ఉంటే ఎక్కువ ప్రమాదం. అయితే రాత్రి పూట అలాంటి ఇబ్బంది ఉండదు. మనుషులు, జంతువుల కదలిక రాత్రి వేళలో మందగిస్తుంది. ఇది రైలు పైలట్‌కు సౌకర్యంగా ఉంటుంది. రాత్రివేళ హైస్పీడ్ రైళ్ల వల్ల జరిగే ప్రమాదాల గురించి వారికి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఈ కారణంగానే రాత్రి వేగాన్ని అందుకోవడానికి, దూరప్రయాణాలను త్వరగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.
అంతేకాదు.. పగటిపూట మీరు రైలులో ప్రయాణించినట్లయితే, ట్రాక్‌లపై నిర్వహణ పనుల కారణంగా కొన్నిసార్లు రైళ్లు ఆకస్మికంగా ఆగిపోతుంటాయి. అయితే, రాత్రి పూట అలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే రాత్రి వేళ రైల్వే పట్టాలపై పనులు జరగవు. దాంతో రైలు వేగంగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు..రైలు స్టేషన్‌లోకి ప్రవేశించే ముందు సాధారణంగా రైలు వేగం తగ్గుతాయి. ట్రాక్‌లు ఖాళీగా ఉన్నాయని తెలియడానికి సిగ్నల్‌ల కోసం వేచి ఉండాల్సి ఉంటుంది.. సంబంధిత ట్రాక్‌లపై రైళు, ప్రజలు లేరని నిర్ధారించాకే వెళ్లాల్సి ఉంటుంది. అయితే, రాత్రి వేళల్లో ఈ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి.. వారికి దూరం నుంచి సిగ్నల్స్ కనిపిస్తాయి. అందువల్ల, రైలు స్టేషన్‌లోకి ప్రవేశించే ముందు వేగాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు.
COMMENTS