ICF: 782 Act Apprentice Posts in Integral Coach Factory
ICF: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) 2023-24 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీనిద్వారా మొత్తం 782 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ట్రేడును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.
ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 782
* ఫ్రెషర్స్: 252
➥ కార్పెంటర్: 40
➥ ఎలక్ట్రీషియన్: 20
➥ ఫిట్టర్: 54
➥ మెషినిస్ట్: 30
➥ పెయింటర్: 38
➥ వెల్డర్: 62
➥ ఎంఎల్‌టీ రేడియాలజీ: 04
➥ ఎంఎల్‌టీ పాథాలజీ: 04
* ఎక్స్-ఐటీఐ: 530
➥ కార్పెంటర్: 50
➥ ఎలక్ట్రీషియన్: 102
➥ ఫిట్టర్: 113
➥ మెషినిస్ట్: 41
➥ పెయింటర్: 49
➥ వెల్డర్: 165
➥ పీఏఎస్‌ఏఏ: 10
అర్హత: ట్రేడును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో పదోవ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 30.06.2023 నాటికి 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టైపెండ్: నెలకు రూ.6000 నుంచి రూ.7000.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.05.2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.06.2023.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR APPLY ONLINE CLICKHERE
COMMENTS