IBPS CRP RRB XII Recruitment 2023 Apply Online for 8594 Posts.
IBPS RRB 2023 Notification: ఐబీపీఎస్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల..జూన్ 21 దరఖాస్తుకు గడువు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)... రీజినల్ రూరల్ బ్యాంకు (ఆర్ఆర్బీ)ల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-XII (సీఆర్పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 8594 గ్రూప్ ఎ- ఆఫీసర్ (స్కేల్-1, 2, 3), గ్రూప్ బి- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టులు భర్తీ కానున్నాయి. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 1న ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 5650 పోస్టులు
2. ఆఫీసర్ స్కేల్-1 (ఏఎం): 2563 పోస్టులు
3. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) స్కేల్-2: 367 పోస్టులు
4. ఐటీ ఆఫీసర్ స్కేల్-2: 106 పోస్టులు
5. సీఏ ఆఫీసర్ స్కేల్-2: 63 పోస్టులు
6. లా ఆఫీసర్ స్కేల్-2: 56 పోస్టులు
7. ట్రెజరీ మేనేజర్ స్కేల్ -2: 16 పోస్టులు
8. మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్-2: 38 పోస్టులు
9. అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్-2: 118 పోస్టులు
10. ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్): 76 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి (01-06-2023 నాటికి): ఆఫీసర్ స్కేల్ -3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్ -2 (మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
దరఖాస్తు రుసుము : ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; మిగతా వారందరికీ రూ.850.
ముఖ్యమైన తేదీలు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీ: 01.06.2023 నుంచి 21.06.2023 వరకు.
అప్లికేషన్ ఫీజు / ఇంటిమేషన్ ఛార్జీ చెల్లింపు తేదీలు: 01.06.2023 నుంచి 21.06.2023 వరకు.
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్లోడ్: 10.07.2023.
ప్రీ-ఎగ్జామ్ నిర్వహణ తేదీలు:17.07.2023 నుంచి 22.07.2023 వరకు.
ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్:జులై/ ఆగస్టు, 2023.
ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2023.
ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి:సెప్టెంబర్, 2023.
ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్: సెప్టెంబర్, 2023.
ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష తేదీ: సెప్టెంబర్, 2023.
మెయిన్స్ ఫలితాల వెల్లడి: (ఆఫీసర్ స్కేల్ 1, 2, 3): అక్టోబర్, 2023.
ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్లోడ్ (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3): అక్టోబర్ / నవంబర్, 2023.
ఇంటర్వ్యూ తేదీలు (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3): అక్టోబర్/ నవంబర్, 2023.
ప్రొవిజనల్ అలాట్మెంట్ (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 & ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)): జనవరి, 2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR APPLY ONLINE CLICKHERE
COMMENTS