Head Constable Jobs with Tenth Qualification. Application Process Details.
టెన్త్ అర్హతతో హెడ్ కానిస్టేబుల్ జాబ్స్. అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు.
రక్షణ దళాల్లో పోలీస్ ఉద్యోగాల్లో చేరాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల కాలంలో పారా మిలిటరీ ఫోర్సెస్‌లో భారీగా రిక్రూట్‌మెంట్ జరుగుతోంది.
ఇప్పటికే బీఎస్‌ఎఫ్, సీఆర్‌ఫీఎఫ్‌లో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ జరుగుతుండగా, తాజాగా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లేటెస్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ సంస్థ పదో తరగతి అర్హతతో హెడ్ కానిస్టేబుల్ (మిడ్‌వైఫ్) - గ్రూప్ 'సి' (నాన్ గెజిటెడ్ & నాన్ మినిస్టీరియల్) పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జూన్ 9న ప్రారంభం కానుంది. ఈ గడువు జులై 8న ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి.
అర్హత ప్రమాణాలు
ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు అప్లై చేసుకోవాలంటే, అభ్యర్థుల వయసు 2023 జులై 8 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి లేదా అందుకు సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలి. గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఆక్సిలరీ, నర్సింగ్ మిడ్‌వైఫరీ కోర్సులో పాసై ఉండాలి. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
కేటగిరీ వారిగా ఖాళీల వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఐటీబీపీలో మొత్తం 81 ఖాళీలను భర్తీ చేస్తారు. జనరల్ కేటగిరీ నుంచి 34, ఓబీసీ- 22, ఎస్సీ- 12, ఎస్టీ- 6, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి 7 పోస్టులు భర్తీ చేయనున్నారు.
అప్లికేషన్ ప్రాసెస్
అర్హత ఉన్న అభ్యర్థులు ఐటీబీపీ అధికారిక పోర్టల్ https://itbpolice.nic.in/ విజిట్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి, హెడ్ కానిస్టేబుల్(మిడ్‌వైఫ్) రిక్రూట్‌మెంట్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అవసరమైన వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి
తర్వాత అప్లికేషన్ ఐడీ నంబర్, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అయి అప్లికేషన్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
అన్ని వివరాలు చెక్ చేసుకొని, అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
సెలక్షన్ ప్రాసెస్
ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ (మిడ్‌వైఫ్) పోస్ట్‌ల భర్తీకి అభ్యర్థుల ఎంపిక వివిధ దశల్లో ఉంటుంది. ముందు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) నిర్వహిస్తారు. తర్వాత రాత పరీక్ష, చివరగా ప్రాక్టికల్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ దశలను క్లియర్ చేసే అభ్యర్థులు హెల్త్‌కేర్ ప్రొవైడర్స్‌గా పనిచేసే అవకాశం ఉంటుంది. స్కిల్స్ పెంపొందించుకోవడానికి అభ్యర్థులకు ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు.
జీతభత్యాలు
ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రకారం ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 మధ్య జీతం లభిస్తుంది.
COMMENTS