scholarship and fellowships: A financial egg for a brighter future.. Don't miss these scholarships..
scholarship and fellowships: సమున్నత భవితకు ఆర్థిక అండ.. ఈ స్కాలర్షిప్లను మిస్ చేసుకోవద్దు..
ఉన్నత విద్య అనేది ప్రతి విద్యార్థి కల. కానీ అందరూ దానిని అందుకోలేరు. దానికి రకరకాల కారణాలుంటాయి. వాటిల్లో ప్రధానమైనది ఆర్థిక లేమి. సరైన ఆర్థిక వెసులుబాటు లేని కారణంగా చదువులను మధ్యలోనే ఆపేసేవారు చాలా మంది ఉంటారు. అలాంటి వారికి పలు స్కాలర్ షిప్ లు ఉపకరిస్తాయి. అలాగే పరిశోధనలు చేయాలనుకొనేవారికి ఫెలోషిప్ లు సాయపడతాయి. మిమ్మల్ని సమున్నతంగా నిలబెట్టడానికి ఇవి ఆర్థిక అండను కల్పిస్తాయి. ఈ నేపథ్యంలో జూన్ నుంచి ఆగస్టులోపు దరఖాస్తు చేసుకోవాల్సిన మూడు స్కాలర్షిప్, ఫెలోషిప్ ప్రోగ్రామ్ లు, అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల నుంచి పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందిస్తున్నాం. అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, స్కాలర్ షిప్ ఎంత ఇస్తారు? వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..
జ్ఞాన్దన్ స్కాలర్షిప్ 2023(GYANDHAN SCHOLARSHIP 2023)..
పోస్ట్‌గ్రాడ్యుయేట్-స్థాయి విద్యార్థులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి జ్ఞాన్‌ధన్ ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్న విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ పథకం లక్ష్యం.
అర్హత:
గుర్తింపు పొందిన భారతీయ సంస్థల నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్న భారతీయ పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, జర్మనీలలో రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును అభ్యసించడానికి సిద్ధంగా ఉండాలి. ఒకేసారి రూ. లక్ష వరకూ ఆర్థిక సాయం అందిస్తారు. ఆన్ లైన్ లోమాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 2023, ఆగస్టు 31 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
COMMENTS