Explanation of what happens when crows crow in front of a house.
ఇంటి ముందు కాకులు గుంపులు గుంపులుగా అరిస్తే ఏమవుతుందో వివరణ.
వాస్తు శాస్త్రంలో కాకి వల్ల కలిగే లాభాల గురించి, నష్టాల గురించి వివరించారు. ఉదాహరణకు కాకులు ఇంటిదగ్గర అరిస్తే బంధువులు వస్తారని, పని మీద వెళ్తున్నప్పుడు కాకి నోట్లో మాంసం ముక్క పట్టుకుని ఎదురు వస్తే పోయే పనులు మంచిగా జరుగుతాయని ఇలాంటివి చెబుతూ ఉంటారు.
శకునశాస్త్రంలో కాకి గురించిన అనేక విషయాలు ప్రస్తావించారు. మన ప్రాంతంలో కాకులు చాలా సాధారణంగా కనిపించే పక్షులు. కాకిని యుముని దూతగా పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆ నల్లని పక్షి భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే మంచి చెడులను గురించిన సందేశాన్ని మనకు తెలియజేస్తుంది అని నమ్మకం.
అందుకే కాకి అందించే సంకేతాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. మామూలుగా కాకి ఇంటి ముందు లేదంటే బాల్కనీలో ఆవరణలో అదేపనిగా అరుస్తూ ఉంటాయి. అలా పది అరుస్తున్నాయి అంటే ఇంటికి అతిధులు రాబోతున్నారని అర్థం. లేదంటే కుటుంబానికి దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులు రాబోతున్నారన్న దానికి సంకేతం. శకున శాస్త్రాన్ని అనుసరించి ఇంటికి ఉత్తరం వైపున పగటి పూట కాకి అరిస్తే లేదా తూర్పు వైపున కాకి అరిచినా అది శుభ శకునమే. ఏదో మంచి జరుగుతుందని అర్థం. ఏదైనా టూర్ లేదా విహారానికి వెళ్లేందుకు బయలుదేరుతున్న సమయంలో కాకి కిటికిలో కూర్చుని అరిస్తే మీ ట్రిప్ విజయవంతం అవతుందని అర్థం. పూర్తిగా ఎండిపోయిన చెట్ట మీద కాకి కూడా మంచి శకునం కాదు ఇది కూడా ఇంట్లో ఎవరికో జరగబోయే కీడుకి సూచకంగా భావించాలి.
కాకుల గుంపు బాల్కాని లేదా ఇంటి ఆవరణలో చేరి అరుస్తుంటే మాత్రం అది అంత మంచి శకునం కాదు.ఆహారాన్ని ముక్కున కరుచుకుని వెళ్లే కాకి కనిపిస్తే అది కూడా శుభ సూచకం. మీరు చిరకాలంగా కోరుకుంటున్న పెద్ద కోరికేదో తీరబోతోందని అనడానికి ప్రతీక. కాకి తల మీద తన్నడం లేదా, మీద వాలడం, లేదా తల మీదుగా రెక్కలాడిస్తూ ఎగిరిపోవడం అస్సలు మంచి శకునాలు కాదు. ఈ పక్షులు ఇంట్లో ఏదో అశుభం జరగబోతోందని సంకేతం. ఆ కుటుంబం ఏదో ఇబ్బందుల్లో పడబోతోందని లేదా ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం కలుగబోతోందని అర్థం.దక్షిణం దిశగా కాకి అరిస్తే మాత్రం శుభ శకునం కాదు. ఇది మీ పితృదేవతలు కోపంగా ఉన్నారనడానికి సంకేతం. నీళ్లు తాగే కాకి కనిపిస్తే అది శుభసూచకం. ఇలా కాకి నీళ్లు తాగుతూ కనిపిస్తే తలపెట్టిన కార్య సిధ్ధికి సూచకంగా భావించాలి. ఇది ఇంట్లో లేదా ఆత్మీయుల మరణానికి సంకేతం కావచ్చు. కలలో గుంపులుగా కాకులు కనిపించడం అంతమంచి శకునం కాదట. ఇది త్వరలోజరగబోయే చెడుకు సంకేతంగా భావించాలట.
COMMENTS