Do you know this about the chairs we use? Little known facts about plastic chairs and stools.
మనం వాడే కుర్చీల గురించి ఈ విషయం మీకు తెలుసా ? ప్లాస్టిక్ కుర్చీలు మరియు స్టూళ్ల గురించి తెలియని నిజాలు.
మన ఇంట్లోనే వుంటాయి. మనమే వాటిని వినియోగిస్తాం. కానీ అనేక వస్తువుల గురించి మనకు పూర్తిగా తెలీదు. అయితే, తెలీదు అనడంకన్నా మనం పెద్దగా పట్టించుకోమనే మాట నిజమేమో. తెలుసుకున్న తర్వాత లేదా చూసిన తర్వాత ఆశ్చర్యపోక తప్పదు. ఇలాంటి ఆసక్తికరమైన అంశాల్లో ప్లాస్టిక్ కుర్చీలు ఒకటి.
రౌండ్ షేప్‌లో ఉన్న కుర్చీలను గమనిస్తే వాటికి మధ్యలో ఒక రంధ్రం ఉండడానికి గుర్తిస్తాం. అయితే ఆ రంధ్రాన్ని ఎందుకు ఇస్తారో మీకు తెలుసా.? ఏముంది కుర్చీని ఈజీగా లిఫ్ట్ చేయడానికి అని అంటారు కదూ.! అయితే అది నిజమే అయినప్పటికీ కుర్చీని మరో విధంగా కూడా లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ రంధ్రం ఏర్పాటు అసలు ఉద్దేశం అది కాదు.
సాధారణంగా ఇలాంటి కుర్చీలను ఒకదానిపై మరొకటి పెడుతుంటాం. స్థలం అడ్జెస్ట్‌మెంట్ కోసం ఇలా చేస్తుంటారు. అయితే ఇలా ఒకదానిపై మరొకటి పెట్టిన తర్వాత తీయడం ఇబ్బంది అవ్వకుండానే ఇలా రంధ్రాలు ఇస్తారు. సాధారణంగా కుర్చీలను ఒక దానిపై మరొకటి పెడితే ఎయిర్ గ్యాప్ వస్తుంది. దీంతో కుర్చీలను లాగడం ఇబ్బందిగా మారుతుంది. ఈ రంధ్రాల ద్వారా ఎయిర్ గ్యాప్ రాకుండా ఉంటుంది. దీంతో సులభంగా కుర్చీలను విడదీయొచ్చు.
ఇక ఈ కుర్చీలకు రంధ్రాలు ఏర్పాటు చేయడానికి మరో కారణం కూడా ఉంది. ఎక్కువ బరువున్న ఓ వ్యక్తి కుర్చీపై కూర్చొంటే వ్యక్తి బరువంతా ఒకే చోట పడడంతో కుర్చీ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఇలా రంధ్రం ఉండడతో శరీర బరువు కుర్చీ అంతా సమానంగా స్ప్రెడ్ అవుతుంది. దీంతో చెయిర్‌కు ఎలాంటి ప్రమాదం ఉండదు. మన కుర్చీ కథ అదన్నమ్మాట...!!
COMMENTS