Defense Jobs: Good news for the unemployed.. 200 jobs in Indian Ordnance Factory..
Defence Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 200 ఉద్యోగాలు..
ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనుంది. అభ్యర్థులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంపిక చేయనున్నారు. ముందుగా ఒక సంవత్సరం కాలానికి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆ తరువాత కాంట్రాక్ట్ వ్యవధిని నాలుగేళ్లకు పొడిగిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఈ పక్రియను జూన్ 17 నుంచి 30 మధ్య పూర్తిచేయాల్సి ఉంటుంది.
* అర్హత ప్రమాణాలు
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి సడలింపు వరుసగా మూడేళ్లు, ఐదేళ్లు, మూడేళ్లు కల్పించారు. అభ్యర్థులు తప్పనిసరిగా AOCP ట్రేడ్ (NCTVT)ఎక్స్-అప్రెంటిస్‌లు అయి ఉండాలి. సైనిక మందుగుండు సామగ్రి & పేలుడు పదార్థాల తయారీ, నిర్వహణలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ట్రైనింగ్ తీసుకొని ఉండాలి.
* ఖాళీ వివరాలు
జనరల్- 80
ఓబీసీ-ఎన్‌సీఎల్- 30
ఎస్సీ- 30
ఎస్టీ- 40
ఎక్స్-సర్వీస్‌మెన్- 20
* అప్లికేషన్ ప్రాసెస్
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో డేంజర్ బిల్డింగ్ వర్కర్స్ పోస్ట్‌ల కోసం అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్‌లైన్ మోడ్‌లో పూర్తిచేయాలి. నోటిఫికేషన్ నుంచి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అన్ని వివరాలతో అప్లికేషన్‌ను ఫిలప్ చేయాలి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లను దానికి జత చేయాలి. జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియా, జిల్లా: జబల్‌పూర్, మధ్యప్రదేశ్ , పిన్- 482005 అనే అడ్రస్‌కు అప్లికేషన్‌ను సెండ్ చేయాలి.
* అవసరమయ్యే డాక్యుమెంట్స్
ఎడ్యుకేషనల్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్(రిజర్వ్డ్ కేటగిరీ), రెసిడెన్షియల్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్‌కార్డ్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, సెల్ఫ్ అటెస్టెండ్ ఫోటోలు తదితర డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలను అప్లికేషన్‌కు జత చేయాలి.
* ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపికలో ఐటీఐ స్కోర్స్ కీలకం. ITIలో నిర్వహించే ట్రేడ్ టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇది ఖమారియాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో నిర్వహించనున్నారు.
* బాధ్యతలు
డేంజర్ బిల్డింగ్ వర్కర్ పోస్ట్‌కు ఎంపికయ్యే అభ్యర్థులు మిలిటరీ పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి తయారీ, నిర్వహణను చూసుకోవాల్సి ఉంటుంది.
* జీతభత్యాలు
ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 మధ్య ఉంటుంది.
COMMENTS