Dangerous App: Be careful with that app.. All your data is stolen! If it is on your phone, delete it immediately..
Dangerous App: ఆ యాప్‌తో తస్మాత్ జాగ్రత్త.. మీ డేటా మొత్తం చోరీ! మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
సాంకేతికత ఎంతలా వృద్ధి చెందుతున్నా.. అదే స్థాయిలో నేరగాళ్లు కూడా తమ కొత్త కొత్త మార్గాలను వెతుక్కుంటూ దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో డేటా చోరీ, సైబర్ నేరాలు అధికమయ్యాయి. ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక రూపంలో సైబరాసురులు మన వ్యక్తిగత డేటా దొంగిలిస్తూ.. ఆపై బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో ఈసెట్(ESET) అనే ఓ సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆండ్రాయిడ్ యూజర్లకు ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారులు గ్లూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకొనే ఓ యాప్ లో హానికరమైన వైరస్ ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. అది 2021 సెప్టెంబర్ నుంచి వ్యక్తుల డేటాను దొంగిలిస్తున్నట్లు వివరించింది. ఆ యాప్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? దాని నుంచి రక్షణ పొందాలంటే ఏం చేయాలి. తెలుసుకుందాం రండి..
ఐ రికార్డర్- స్క్రీన్ రికార్డర్..
ఈసెట్ సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ సంస్థ ప్రకటించిన దాని ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న ఐ రికార్డర్ స్క్రీన్ రికార్డర్ యాప్ ద్వారా హానికరమైన మాల్వేర్ మన ఫోన్లలోకి వస్తుంది. ప్రస్తుతం దీనిని ప్లే స్టోర్ తొలగించినప్పటికీ.. 2021, సెప్టెంబర్ 19 నుంచి దాదాపు 50,000 డౌన్ లోడ్లు ఈ యాప్ కు ఉన్నట్లు పేర్కొంది. అయితే తొలిసారి దానిని ప్లే స్టోర్ అప్ లోడ్ చేసినప్పుడు దానిలో ఎటువంటి హానికరమైన వైరస్ లు లేవని.. కానీ 2022 ఆగస్టులో ఈ యాప్ అప్ డేట్ చేశారని.. ఆ అప్ డేట్ లోనే హానికరమైన మాల్వేర్ జొప్పించినట్లు వివరించింది.
ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే..
ఈ స్క్రీన్ రికార్డర్ యాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల ఫోన్ల నుంచి సేవ్ చేసిన వెబ్ పేజీలు, ఇమేజ్ లు, వీడియో, డాక్యుమెంట్ ఫైల్స్, ఫైల్ ఫార్మాట్లు ద్వారా డేటా చోరీ చేస్తోంది. అలాగే ఇది మైక్రో ఫోన్ రికార్డింగ్స్ ను కూడా తీసుకుంటుంది.
ఇలా చేస్తే మీరు సేఫ్..
ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇప్పటికే తొలిగించారు. మీరు ఇప్పటికే ఈ యాప్ ను మీ ఫోన్లో కలిగి ఉంటే దానిని వెంటనే డిలీట్ చేసేయాలి. అలాగే సైబర్ సెక్యూరిటీ సంస్థలు ఇటువంటి మాల్వేర్ ల నుంచి సేఫ్ గా ఉండటానికి పులు సూచనలు చేస్తున్నాయి. అవేంటో చూద్దాం..
థర్డ్ పార్టీ వద్దు.. మీరు ఏదైనా యాప్ డౌన్ లోడ్ అధిక రిప్యూటేషన్ ఉన్న యాప్ స్టోర్ల నుంచి మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి. అలాగే థర్డ్ పార్టీ యాప్ లను వినియోగించవచ్చు. ఎందుకంటే వీటిని గూగుల్ వీటని రివ్యూ చేయదు.
యాప్ రివ్యూలు చూడండి.. ఏదైనా యాప్ ను డౌన్ లోడ్ చేసే ముందు ఆ యాప్ నకు సంబంధించిన రివ్యూలు ముందు చదవండి. దానిలో ఎదైనా స్ట్రేంజ్ విషయాలు ఉంటే ఆ యాప్ కి దూరంగా ఉండండి.
ఫ్రీ యాంటీ వైరస్ లను వాడొద్దు.. ఫ్రీ యాంటీ వైరస్ ట్రయల్స్ ని వాడొద్దు. వాటిల్లోనే మాల్వేర్ అధికంగా ఉంటాయి. మీ డివైజ్ ని ఎటాక్ చేసి డేటా కాజేస్తాయి.
మీ ఫోన్ అప్ డేటెడ్ గా ఉంచుకోండి.. మీ ఫోన్ ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉంచుకోండి. ఎందుకంటే కొత్త అప్ డేట్లలో సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి.
COMMENTS