APSFC Recruitment 2023: Andhra Pradesh State Financial Corporation Jobs Notification.
APSFC Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఆకర్షణీయ జీతంతో ప్రభుత్వ కొలువులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విజయవాడకు చెందిన ఆంధ్రప్రదే స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (APSFC).. ఒప్పంద ప్రాతిపదికన 20 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఏయే అర్హతలుండాలంటే..
అసిస్టెంట్ మేనేజన్ ఫైనాన్స్ పోస్టులకు.. సీఏ (ఇంటర్) లేదా సీఎమ్‌ఏ (ఇంటర్) లేదా ఎంబీఏ లేదా పీజీడీఎమ్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఎమ్‌ఎస్ ఆఫీస్, ఫైనాన్షియల్ మోడలింగ్ వంటి కంప్యూటర్ నైపుణ్యాలు కూడా వచ్చి ఉండాలి. బ్యాంక్స్/ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్/ఫైనాన్షింగ్/అకౌంటింగ్/టీఈవీ స్టడీ లేదా తత్సమాన సంస్థలో కనీసం ఏడాదిపాటు పని అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ మేనేజన్ (టెక్నికల్) పోస్టులకు.. మెకానిక్/సివిల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌లో 60 శాతం మార్కులతో బీటెక్ డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ మేనేజన్ (టెక్నికల్) పోస్టులకు.. లా డిగ్రీలో 55 శాతం డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి..
దరఖాస్తుదారుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 30, 2023వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ కేటగిరీలకు చెందిన వారు రూ.354; జనరల్/ బీసీలకు రూ.590 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
COMMENTS