AmmaOdi Funds in 44 Lakh Mothers' Accounts - Timing, Guidelines.
44 లక్షల తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు- ముహూర్తం, మార్గదర్శకాలు.
ము ఖ్యమంత్రి జగన్ మానసపుత్రిక అమ్మఒడి నిధులు ఈ నెల 28న విడుదల చేయనున్నారు. నవరత్నాల అమల్లో భాగంగా ప్రతీ ఏటా విద్యా అమ్మఒడి నిధులను సీఎం జగన్ విడుదల చేస్తున్నారు.
అందులో భాగంగా అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. ఈ నెల 22న లబ్ధిదారుల జాబితా ప్రకటించనున్నారు. విద్యార్ధులకు 75 శాతం హాజరుతో పాటుగా ప్రభుత్వం నిర్దేశించిన నిబందనలకు అనుగుణంగా ఎంపికైన 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు జమకానున్నాయి.
అమ్మఒడి మార్గదర్శకాలు జారీ:
అమ్మఒడి పథకం నిధుల విడుదల పైన ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 22022-23 సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి ఇంర్మీడియట్ వరకు చదివే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు.
ఇప్పటికే ప్రభుత్వం విద్యార్ధులకు 75 శాతం హాజరు తప్పనిసరి నిబంధన అమలు చేస్తోంది. ఇప్పటి వరకూ జగన్ ప్రభుత్వం మూడుసార్లు అమ్మఒడి నగదు ఇచ్చింది. ఇప్పుడు ఇవ్వబోయేది నాలుగో విడత. లబ్దిదారుల జాబితాను ఈ నెల 22న ప్రకటించనున్నారు. ఆన్ లైన్ లో ఉంచటంతో పాటుగా స్థానిక సచివాలయాల్లోనూ లబ్దిదారుల జాబితా అందుబాటులో ఉంచనున్నారు. అమ్మఒడి పథకం కింద మూడేళ్ల కాలంలో ఏపీ ప్రభుత్వం రూ.19,617 కోట్లు అందించింది.
రూ 13 వేలు చొప్పున జమ:
అమ్మఒడి పథకంలో తొలి ఏడాది తల్లులకు రూ.15 వేలు జమ చేసారు. గత ఏడాది నుంచి అమ్మఒడి కింద ఇచ్చే రూ 15 వేల నుంచి పాఠశాల..టాయిలెట్ల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ 2వేలు మినహాయిస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ అమ్మఒడి నిధుల విడుదల సమయంలోనే స్పష్టంగా వెల్లడించారు.
గత ఏడాది 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ 13 వేలు చొప్పున నిధులు జమ అయ్యాయి. ఈ ఏడాది అదే విధంగా రూ 13 వేలు జమ చేయనున్నారు. రూ.1000 జిల్లా టాయిలెట్ నిర్వహణ నిధి(డీటీఎంఎఫ్)కి, మరో రూ.1000 జిల్లా పాఠశాలల నిర్వహణ నిధి(డీఎస్ఎంఎఫ్) ఖాతాలకు జమ చేయనున్నారు. టెన్త్ తర్వాత ఇంటర్‌లో చేరే వారికి పథకం కొనసాగుతుందని ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
నాలుగో సారి నిధుల విడుదల:
ఐటీఐ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీల్లో చేరే వారికి విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు వర్తిస్తాయని, వారికి అమ్మఒడి ఉండదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. కుటుంబ ఆదాయం రూ 12 వేలు, గ్రామాల్లో రూ 10 వేల లోపు ఉండే వారిని ఈ పధకంలో అర్హులుగా చేర్చారు.
ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ మినహా ఇతర నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారు అనర్హులుగా పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్ ఇదే సమయంలో ఈ నెల 23వ తేదీ నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం అమలుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హత ఉండి పథకాలు అందని వారిని గుర్తించి..వారిని లబ్దిదారులుగా చేర్చేందుకు నిర్ణయించారు. అర్హులుగా చేరిన వారికి ఆగస్టు నుంచి పథకాలు అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది.
COMMENTS