Aadhaar News: Alert for those who have Aadhaar.. These are the 2 tasks that must be completed this month or else..
Aadhaar News: ఆధార్ ఉన్న వారికి అలర్ట్.. ఈ నెలలో కచ్చితంగా పూర్తి చేయాల్సిన 2 పనులు ఇవే, లేదంటే..
Aadhaar Card | ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా, ట్యాక్స్ చెల్లింపులు, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, రేషన్ కార్డు అప్లై ఇలా చాలా వాటికి ఆధార్ కార్డు ఉండాల్సిందే. లేదంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.
అందుకే ఆధార్ కార్డుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆధార్ కార్డుకు సంబంధించిన ఏ అంశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే పని పూర్తి చేసుకోవడం ఉత్తమం. ఆధార్ కార్డు కలిగిన వారు ఈ నెలలో కచ్చతంగా రెండు పనులు పూర్తి చేయాల్సి ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోవడానికి జూన్ 14 వరకు గడువు ఉంది. అంటే ఉచితంగానే మీరు మీ ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ వెబ్‌సైట్ ద్వారా ఈ పని పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఎలాంటి చార్జీలు లేకుండా వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు.
అదే జూన్ 14 దాటితే మాత్రం మళ్లీ చార్జీలు పడతాయి. అందువల్ల ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉన్న వారు వెంటనే ఆన్‌లైన్‌లో ఉచితంగా వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. జూన్ 14 దాటితే చార్జీలు చెల్లించుకోవాలి.
అలాగే ఆధార్ కార్డు కలిగిన వారు మరో పని కూడా పూర్తి చేసుకోవాలసి ఉంది. పాన్ కార్డు కలిగిన వారు ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. ఈ నెలాఖరు కల్లా ఈ పని కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఒకవేళ ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేసుకోకపోతే మాత్రం జూలై 1 నుంచి పాన్ కార్డు చెల్లుబాటు కాదని అర్థం చేసుకోవాలి. అప్పుడు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సాధారణంగా అయితే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి 2023 మార్చి 31తోనే గడువు అయిపోయింది. అయితే దీన్ని జూన్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా చాలా సార్లు పాన్ కార్డు ఆధార్ కార్డు గడువు పొడిగిస్తూ వచ్చారు.
పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే అప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయలేరు. అలాగే ఇన్వెస్ట్‌మెంట్లు కూడా చేయలేరు. ఇలా మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే రెండింటినీ వెంటనే లింక్ చేసుకోండి.
జూన్ 30లోపు ఆధార్ పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే తర్వాత రూ. 1000 జరిమానాతో మీరు ఈ పని పూర్తి చేసుకోవచ్చు. కాగా పాన్ కార్డు కలిగిన వారు ఆధార్ కార్డుతో వెంటనే లింక్ చేసుకోండి. ఒకవేళ మీ వద్ద పాన్ కార్డు లేకపోతే ఇబ్బంది ఏమీ లేదు.
COMMENTS