Unknown Calls: Are you getting a lot of unknown calls? Simply block it like this
Unknown Calls: గుర్తుతెలియని కాల్స్ ఎక్కువగా వస్తున్నాయా? సింపుల్‌గా ఇలా బ్లాక్ చేయండి.
Unknown Calls | గుర్తుతెలియని నెంబర్ల నుంచి పదేపదే కాల్స్ వస్తుంటే స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చి వాటిని బ్లాక్ చేయొచ్చు.సైబర్ మోసగాళ్లు ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి కాల్స్ (International Calls) చేస్తూ స్మార్ట్ఫోన్యూజర్లకు వల వేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి కాల్స్ ఎక్కువయ్యాయి. సెల్యులార్ కాల్స్ మాత్రమే కాదు, యూజర్లకు వాట్సప్‌ద్వారా కూడా ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. అంతర్జాతీయ నెంబర్ల నుంచి స్కామ్ కాల్స్ పెరుగుతున్నాయి. ఈ మోసపూరిత కాల్స్ (Scam Calls) ఎక్కువగా వివిధ దేశాల నుంచి స్తున్నవే. చాలా మంది వినియోగదారులు ఈ కొత్త స్కామ్ బారిన పడుతున్నారు. స్కామ్ మాత్రమే కాదు దీని వల్న గోప్యత మరియు భద్రతా సమస్యలు ఉన్నాయి. అంతర్జాతీయ నెంబర్ల నుంచి స్కామ్ కాల్స్ విషయానికి వస్తే కాలర్స్ లేదా హ్యాకర్స్ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు పలు రకాల టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు.
మీ వ్యక్తిగత డేటా, ఆర్థిక వివరాలు లేదా ఇతర రహస్య సమాచారం తెలుసుకోవడానికే ఈ కాల్స్ చేస్తుంటారు సైబర్ నేరగాళ్లు. ఈ కాలర్స్‌తో మాట్లాడితే మీ వ్యక్తిగత వివరాలను తెలుసుకొని మీ బ్యాంకు ఖాతాలు కాల్ చేస్తుంటారు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తెలియని కాలర్స్‌తో వివరాలు పంచుకోకూడదు. ముఖ్యంగా అంతర్జాతీయ నెంబర్ల నుంచి కాల్ చేస్తున్న వారితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వస్తుంటే, అలాంటి కాల్స్‌కు అడ్డుకట్ట వేయొచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు, ఐఫోన్ యూజర్లు ఏం చేయాలో తెలుసుకోండి.
ఆండ్రాయిడ్ ఫోన్లో సెట్టింగ్స్ మార్చండి ఇలా...
Step 1- ముందుగా ఫోన్ యాప్ ఓపెన్ చేయాలి.
Step 2- టాప్ రైట్ కార్నర్లో ఉన్న త్రీడాట్స్ పైన క్లిక్ చేయాలి.
Step 3- సెట్టింగ్స్ పైన క్లిక్ చేయాలి.
Step 4- కాల్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయాలి.
Step 5- బ్లాక్ నెం
Step 6- Unknown ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
ఐఫోన్లో సెట్టింగ్స్ మార్చండి ఇలా...
Step 1- ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
Step 2- ఫోన్ పైన క్లిక్ చేయాలి.
Step 3- స్క్రోల్ డౌన్ చేయాలి.
Step 4- Silence Unknown Callers పైన క్లిక్ చేయాలి.
Step 5- ఆప్షన్ ఎనేబుల్ చేయాలి.
ఈ సెట్టింగ్స్‌తో మీకు గుర్తుతెలియని వారి నుంచి ఫోన్ కాల్స్ వస్తే మీ ఫోన్ రింగ్ కాదు. అయితే ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చిందన్న వివరాలు కాల్ లిస్ట్‌లో చూడొచ్చు. ఈ సెట్టింగ్స్ మాత్రమే కాకుండా తెలియని నంబర్ల నుండి కాల్స్ బ్లాక్ చేయడానికి మార్గాలు ఉన్నాయి. థర్డ్ పార్టీ కాల్ బ్లాకింగ్ యాప్‌ను ఉపయోగించవచ్చు. యాప్ స్టోర్ లేదా ప్లేస్టోర్‌లో పలు కాల్ బ్లాకింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఉచితంగా లభిస్తాయి. అయితే ఈ యాప్స్ డౌన్లోడ్ చేసేముందు వాటి రివ్యూస్ చదవాలి.
COMMENTS