Telangana EAMCET Counselling: Telangana Engineering Entrance Counseling Schedule Released
Telangana EAMCET Counselling: తెలంగాణ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కౌన్సిలింగ్ షెడ్యూలు విడుదలయ్యింది. జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలు ప్రక్రియ ఉండనుంది. జూన్ 26 నుంచి మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ఉంటుంది. జూన్ 26న ఆన్ లైన్ లో కౌన్సిలింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్ ఉంటుంది. జూన్ 28 నుంచి జులై 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన.. జూన్ 28 నుంచి జులై 8 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు ప్రక్రియ ఉంటుంది. జులై 12న మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.
జులై 12 నుంచి 19 వరకు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జులై 21 నుంచి రెండో విడత ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. జులై 21 నుంచి 24 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ నడుస్తుంది. జులై 28న రెండో విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆగస్టు 2 నుంచి తుది విడత ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ స్టార్టవుతుంది. ఆగస్టు 2 నుంచి 4 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. ఆగస్టు 7న ఇంజనీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు చేస్తారు. ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరేందుకు గడువుగా నిర్ణయించారు. ఆగస్టు 8న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఇంజినీరింగ్ ప్రవేశాలు:
మొదటి విడత కౌన్సెల్లింగ్ తేదీలు:
ఆన్లైన్లో కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్: 26/06/2023
ధ్రువపత్రాల పరిశీలన: 28/06/2023 నుంచి 06/07/2023 వరకు
వెబ్ ఆప్షన్లు: 28/06/2023 నుంచి 08/07/2023
మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు: 12/07/2023
ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్: 12/07/2023 నుంచి 19/07/2023 వరకు
రెండవ విడత కౌన్సెల్లింగ్ తేదీలు:
వెబ్ ఆప్షన్లు: 21/07/2023 నుంచి 24/07/2023
మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు: 28/07/2023
తుది విడత కౌన్సెల్లింగ్ తేదీలు:
వెబ్ ఆప్షన్లు: 02/08/2023 నుంచి 04/08/2023
మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు: 07/08/2023
COMMENTS