Sukanya Samriddhi Yojana: Rs.63 lakh returns in Sukanya Samriddhi Yojana... Plan your savings like this..
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో రూ.63 లక్షల రిటర్న్స్... పొదుపు ఇలా ప్లాన్ చేయండి..
ఆడపిల్లల పైచదువులు, పెళ్లి ఖర్చుల కోసం పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana) పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ చిన్న మొత్తాల పొదుపు పథకంలో (Small Savings Scheme) తల్లిదండ్రులు తమ కూతురు పేరుపై ప్రతీ నెలా కొంత పొదుపు చేయొచ్చు. ఏడాదికి కనీసం రూ.250 చొప్పున పొదుపు చేయొచ్చు. గరిష్టంగా ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 చొప్పున పొదుపు చేయొచ్చు. ఈ పథకంలో 15 ఏళ్లు పొదుపు చేయాల్సి ఉంటుంది. ఆడపిల్లలకు 21 ఏళ్లు పూర్తైన తర్వాత పెద్ద మొత్తంలో రిటర్న్స్ వస్తాయి. అయితే ఈ పథకంలో ఎంత పొదుపు చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయో తెలుసుకోండి.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకానికి 7.6 శాతం వార్షిక వడ్డీని ఇస్తోంది. ఈ వడ్డీ రేటును ప్రతీ మూడు నెలలకు ఓసారి సవరిస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. వడ్డీ పెరగొచ్చు, తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇతర పథకాలతో పోలిస్తే అత్యధిక వడ్డీ వస్తున్న చిన్నమొత్తాల పొదుపు పథకం ఇదే.
ఈ పథకంలో జమ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపు లభిస్తుంది. జమ చేసిన డబ్బులకు మాత్రమే కాదు, వాటిపై వచ్చిన వడ్డీ కలిపి, మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తానికి కూడా ఈ మినహాయింపు లభిస్తుంది. ఈ పథకంలో ఎంత ఎక్కువ పొదుపు చేస్తే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మరి ప్రతీ ఏటా ఎంత పొదుపు చేస్తే రిటర్న్స్ ఎంత వస్తాయో తెలుసుకోండి.
సుకన్య సమృద్ధి యోజన పథకంలో ప్రతీ ఏటా రూ.10,000 చొప్పున జమ చేస్తే 15 ఏళ్లలో జమ చేసే మొత్తం రూ.1,50,000 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.2,74,344 వడ్డీ కలిపి మొత్తం రూ.4,24,344 రిటర్న్స్ వస్తాయి.
సుకన్య సమృద్ధి యోజన పథకంలో ప్రతీ ఏటా రూ.20,000 చొప్పున జమ చేస్తే 15 ఏళ్లలో జమ చేసే మొత్తం రూ.3,00,000 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.5,48,687 వడ్డీ కలిపి మొత్తం రూ.8,48,687 రిటర్న్స్ వస్తాయి.
సుకన్య సమృద్ధి యోజన పథకంలో ప్రతీ ఏటా రూ.50,000 చొప్పున జమ చేస్తే 15 ఏళ్లలో జమ చేసే మొత్తం రూ.7,50,000 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.13,71,718 వడ్డీ కలిపి మొత్తం రూ.21,21,718 రిటర్న్స్ వస్తాయి.
సుకన్య సమృద్ధి యోజన పథకంలో ప్రతీ ఏటా రూ.75,000 చొప్పున జమ చేస్తే 15 ఏళ్లలో జమ చేసే మొత్తం రూ.11,25,000 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.20,57,577 వడ్డీ కలిపి మొత్తం రూ.31,82,577 రిటర్న్స్ వస్తాయి.
సుకన్య సమృద్ధి యోజన పథకంలో ప్రతీ ఏటా రూ.1,00,000 చొప్పున జమ చేస్తే 15 ఏళ్లలో జమ చేసే మొత్తం రూ.15,00,000 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.27,43,436 వడ్డీ కలిపి మొత్తం రూ.42,43,436 రిటర్న్స్ వస్తాయి.
సుకన్య సమృద్ధి యోజన పథకంలో ప్రతీ ఏటా రూ.1,50,000 చొప్పున జమ చేస్తే 15 ఏళ్లలో జమ చేసే మొత్తం రూ.22,50,000 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.41,15,155 వడ్డీ కలిపి మొత్తం రూ.63,65,155 రిటర్న్స్ వస్తాయి.
ఈ ఉదాహరణ ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారమే. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మధ్యలో వడ్డీ రేటు పెంచితే ఇంతకన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ వడ్డీ రేటు తగ్గిస్తే రిటర్న్స్ కూడా తగ్గొచ్చు. కాబట్టి ఈ పథకంలో స్థిరమైన వడ్డీ రేటు ఉండదన్న విషయం గర్తుంచుకోవాలి. అందుకే ఈ స్కీమ్‌లో పొదుపు చేసేముందు రిటర్న్స్‌పై ఓ అంచనాకు రావాలి. అయితే ఇప్పటివరకు చూస్తే కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకానికి ఇతర పొదుపు పథకాల కన్నా ఎక్కువ వడ్డీనే ఇచ్చాయి.
COMMENTS