SBI Lunch Break: Lunch break rule in SBI bank... This is the real truth
SBI Lunch Break: ఎస్‌బీఐ బ్యాంకులో లంచ్ బ్రేక్ రూల్... అసలు నిజం ఇదే
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కస్టమర్లకు సేవలు లభించడంలో అనేక ఇబ్బందులు ఉంటాయని సాధారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవలపై అనేక కంప్లైంట్స్ ఉంటాయి.
సోషల్ మీడియాలో ఎస్‌బీఐకి సంబంధించి అనేక మీమ్స్ (SBI Lunch Break Memes), ఫన్నీ పోస్టింగ్స్ కనిపిస్తుంటాయి. లంచ్ బ్రేక్ పేరుతో బ్యాంకు ఉద్యోగులు కస్టమర్లను సరిగ్గా పట్టించుకోరని, నిర్లక్ష్యంగా ఉంటారని అందరూ భావిస్తుండటమే ఇందుకు కారణం. అయితే బ్యాంకులో లంచ్ బ్రేక్ (Bank Lunch Break) అసలు రూల్ ఏంటో తెలుసా? ఈ వార్త చదివిన తర్వాత బ్యాంకు ఉద్యోగులు మిమ్మల్ని మోసం చేయలేరు. ఒకవేళ మీరు ఎప్పుడైనా బ్యాంకుకు వెళ్లినప్పుడు లంచ్ బ్రేక్‌లో ఉన్నామని చెబితే వారికి ఈ రూల్స్ గుర్తు చేసి బ్యాంకులో మీ పని పూర్తి చేసుకోండి.
ఎస్‌బీఐ మాత్రమే కాదు, ప్రతీ బ్యాంకులో లంచ్ బ్రేక్ విషయంలో ప్రత్యేక నియమం ఉంటుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, బ్యాంకులో భోజన విరామం ఉండదు. అవును. ఇది నిజం. బ్యాంకుల్లో లంచ్ బ్రేక్ నియమం లేదు. అయితే అక్కడ ఉద్యోగులు పనిచేస్తుంటారు కాబట్టి వారికి కార్మిక చట్టం వర్తిస్తుంది.కార్మిక చట్టం ప్రకారం, ఎనిమిది గంటలు పనిచేసే వ్యక్తికి తప్పనిసరిగా అరగంట భోజన విరామం ఉండాలి. ఈ కారణంగా బ్యాంకుల్లో ప్రతీ ఉద్యోగికి అరగంట భోజన విరామం లభిస్తుంది.
బ్యాంకు ఉద్యోగులు ఒకేసారి లంచ్ బ్రేక్ తీసుకోవచ్చా?
మరి బ్యాంకు ఉద్యోగులందరూ ఒకేసారి లంచ్ బ్రేక్ తీసుకోవచ్చా? అని సందేహం రావొచ్చు. బ్యాంకు ఉద్యోగులందరూ ఒకేసారి లంచ్ బ్రేక్ తీసుకోకూడదు. రొటేషన్ పద్ధతిలో లంచ్ బ్రేక్ తీసుకోవచ్చు. అంటే కొందరు లంచ్ బ్రేక్ తీసుకొని, మళ్లీ విధుల్లో చేరిన తర్వాత మిగతా ఉద్యోగులు లంచ్ భోజన విరామం తీసుకోవచ్చు. అంటే సగం మంది ఉద్యోగులు లంచ్ బ్రేక్ తీసుకుంటే మిగతా సగం మంది కస్టమర్లకు సేవలు అందిస్తుండాలి.
ఈసారి మీరు బ్యాంకుకు వెళ్లినప్పుడు అక్కడి ఉద్యోగులు లంచ్ బ్రేక్ అని చెబితే వారికి ఈ రూల్ గుర్తుచేయండి. అంతేకాదు... లంచ్ బ్రేక్ అరగంట మాత్రమేమని గుర్తుంచుకోండి. ఉద్యోగులు అంతకన్నా ఎక్కువసేపు లంచ్ బ్రేక్ తీసుకోలేరు. అయితే ఈ లంచ్ బ్రేక్ రూల్ తెలియక సోషల్ మీడియాలో ప్రభుత్వ బ్యాంకులపై అనేక సెటైర్లు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఎస్‌బీఐపైన ఇలాంటి మీమ్స్ ఎక్కువగా చూడొచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని ఈసారి బ్యాంకుకు వెళ్లినప్పుడు, లంచ్ బ్రేక్ అని చెప్పే ఉద్యోగులకు ఈ రూల్స్ గుర్తు చేయండి.
COMMENTS