Salary: How much salary.. how much loan? Find out how!
Salary: ఎంత జీతం ఉంటే.. ఎంత లోన్ వస్తుంది? ఇలా తెలుసుకోండి!
Banks | మీరు లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా?
సొంతింటి కల సాకారం చేసుకోవాలని చూస్తున్నారా? అయితే ఎంత వరకు రుణం వస్తుందో తెలియడం లేదా? అయితే మీరు మీకు ఎంత వరకు లోన్ రావొచ్చొ సులభంగానే తెలుసుకోవచ్చు. దాదాపు చాలా వరకు బ్యాంకులు ఒకే విధమైన విధానాన్ని అనుసరించొచ్చు.
అయితే రుణ అర్హత, లోన్ అమౌంట్ నిర్ణయం వంటి అంశాలపై చాలా విషయాలు ప్రభావం చూపుతాయని గుర్తించుకోవాలి. అందువల్ల అందరికీ ఒకే రకమైన లోన్ ఎలిజిబిలిటీ రాకపోవచ్చు. కొంత మందికి లోన్ కూడా రాకపోవచ్చు.
మీరు తీసుకున్న రుణాన్ని ఎలా చెల్లిస్తారు? చెల్లించగలరా? లేదా? అనే అంశాన్ని బ్యాంకులు ప్రామాణికంగా తీసుకుంటాయి. మీరు ఎంత సంపాదిస్తున్నారనే అంశం ప్రాతిపదికన మీరు లోన్ ఈఎంఐ కట్టగలరా ? లేదా? అని బ్యాంకులు ఒక అంచనాకు వస్తాయి.
బ్యాంకులు అన్ని ఒకే విధానాన్ని అనుసరించకపోవచ్చు. అలాగే కొన్ని బ్యాంకులు ఒకటి కన్నా ఎక్కువ విధానాల్లో లోన్ అమౌంట్‌ను నిర్ణయించే ఛాన్స్ ఉంటుంది. అయితే ఒక థంబ్ రూల్ ఉంది. దీని ద్వారా ఎంత వరకు లోన్ రావొచ్చనే అంశంలో ఒక అంచనాకు రావొచ్చు.
బ్యాంకులు చాలా వరకు రుణ గ్రహాత ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటాయి. సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు? అని చూస్తాయి. బ్యాంకులు సాధారణంగా నెలవారీ వేతనానికి 60 నుంచి 70 రెట్లు వరకు రుణ మొత్తాన్ని అందించొచ్చు. లేదంటే వార్షిక వేతనానికి 6 రెట్లు లోన్ అందించొచ్చు. అయితే కొన్ని బ్యాంకులు ఇంకా ఎక్కువ మొత్తాన్ని కూడా ఇవ్వొచ్చు. అలాగే కొన్ని బ్యాంకులు తక్కువ అమౌంట్ అందించొచ్చు.
స్వయం ఉపాధి పొందుతున్న వారికి, ప్రొఫెషనల్స్‌కు బ్యాంకులు సాధారణంగా 2 నుంచి 3 రెట్లు కూడా రుణాలు అందించొచ్చు. అందువల్ల బ్యాంకులు రుణ గ్రహాతకు ఎంత మొత్తాన్ని రుణం రూపంలో అందించొచ్చనే అంచనాలు బ్యాంక్ ప్రాతిపదికన మారతాయి.
అంతేకాకుండా స్థిర ఆదాయం కలిగిన వారికి మరింత ఎక్కువ లోన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆదాయ వనరు కూడా బ్యాంకులు నిశితంగా గమనిస్తాయి. అందుకే మీరు ఈ అంశాన్ని కూడా పరిగణలో ఉంచుకోవాలి.
అందువల్ల బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలని భావించే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఎంత రుణం రావొచ్చనే విషయంలో ఒక అంచనాకు రావొచ్చు. క్రెడిట్ స్కోర్ బాగుండి, స్థిర ఆదాయం కలిగిన వారికి ఈజీగా లోన్ రావొచ్చు. అలాగే ఈఎంఐ చెల్లింపులు తక్కువగా ఉండేలా చూసుకోండి. లోన్స్ ఉంటే క్లోజ్ చేసుకోండి. ఎక్కువ లోన్స్ ఉన్నా కూడా మళ్లీ రుణం రాకపోవచ్చు.
COMMENTS